Lightning Strike: యెమెన్‌లో విషాదం.. పిడుగుపాటుకు ఏడుగురు మృతి

పిడుగులు పడి ఏడుగురు చనిపోయిన ఘటన యెమెన్‌లో చోటు చేసుకుంది. యెమెన్‌లోని వాయువ్య ప్రావిన్స్‌లోని హొడైదాలో గత 24 గంటల్లో పిడుగుపాటుకు ఏడుగురు మరణించారు

Published By: HashtagU Telugu Desk
Lightning

Lightning

Lightning Strike: పిడుగులు పడి ఏడుగురు చనిపోయిన ఘటన యెమెన్‌లో చోటు చేసుకుంది. యెమెన్‌లోని వాయువ్య ప్రావిన్స్‌లోని హొడైదాలో గత 24 గంటల్లో పిడుగుపాటుకు ఏడుగురు మరణించారు. ఈ విషయాన్ని స్థానిక ఆరోగ్య శాఖ తెలిపింది. బాధితుల్లో ఆరుగురు మహిళలు ఉండగా, ఒక వ్యక్తి ఉన్నారు. దీంతో యెమెన్ ప్రభుత్వం పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఐక్యరాజ్య సమితి నివేదికలో దేశంలో మానవతా సంక్షోభాన్ని తీవ్రతరం చేశాయని, తీవ్రమైన వాతావరణ ప్రభావం యెమెన్ పై పడిందని ఈ ప్రభావం ఆహారం, జీవనోపాధి, భద్రతపై పడిందని తెలిపింది.

Also Read: 75 Years Parliament Journey : 75 ఏళ్ల పార్లమెంటు ప్రయాణం.. 5 ముఖ్యమైన పాయింట్లు ఇవే

  Last Updated: 17 Sep 2023, 11:13 AM IST