Site icon HashtagU Telugu

Rain In Hyderabad : హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు.. ఎల్లో అలర్ట్ ప్రకటించిన వాతావ‌ర‌ణ శాఖ‌

Weather Update

Hyd Rains Imresizer

హైదరాబాద్ నగరంలో తేలిక‌పాటి వ‌ర్షాలు కురుస్తున్నాయి. బుధ‌వారం సాయంత్రం హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలలో తేలికపాటి వర్షం కురిసింది. గ‌త రెండు రోజులుగా ఎండ ఎక్కువ‌గా ఉండ‌టంతో ఈ వ‌ర్షాల‌తో న‌గ‌ర‌వాసుల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగింది, భారత వాతావరణ విభాగం-హైదరాబాద్ (IMD-H) శుక్రవారం వరకు నగరానికి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని అంచనా వేసింది. అయితే పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 37 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటాయని తెలిపింది. సమీప జిల్లాలైన ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాలు, మెదక్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.