Site icon HashtagU Telugu

Liger Trailer: లైగర్ ట్రైలర్ రిలీజ్.. యాక్షన్ ప్యాక్డ్ అవతార్‌లో విజయ్

Liger

Liger

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న ట్రైలర్ ఇప్పుడు బహుళ భాషలలో విడుదలైంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రాబోయే పాన్-ఇండియా చిత్రం ఇది. విజయ్ దేవరకొండతో పాటు, అనన్య పాండే, మైక్ టైసన్, రమ్య కృష్ణ కూడా నటించారు. ఈ సినిమా ఆగస్ట్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది. గురువారం ఈ మూవీ ట్రైలర్‌ను హైదరాబాద్, ముంబైలలో లాంచ్ చేశారు. తెలుగు ట్రైలర్‌ను ప్రభాస్‌తో కలిసి మెగాస్టార్ చిరంజీవి, మలయాళాన్ని దుల్కర్ సల్మాన్, హిందీ ట్రైలర్‌ను రణవీర్ సింగ్ విడుదల చేశారు.

లైగర్ ట్రైలర్ ను చూస్తే.. మొదటగా విజయ్ దేవరకొండ పాత్ర పరిచయమవుతుంది. ఈ ట్రైలర్ చూస్తున్నంతసేపు మనల్ని బాక్సింగ్ ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. బాహుబలి ఫేం రమ్య కృష్ణ వాయిస్‌తో తన కుమారుడికి ‘లైగర్’ అనే పేరు పెట్టడానికి గల కారణాన్ని తెలియజేస్తుంది. “నా కొడుకు సంకరజాతి. సింహం, పులికి జన్మించాడు” అని ఇంట్రడక్షన్ ఇస్తుంది. బాహుబలి తర్వాత, రమ్యకృష్ణ మరో పాన్-ఇండియా చిత్రంలో శక్తివంతమైన తల్లి పాత్రలో ఆకట్టుకుంది. లైగర్ మూవీ ఓ సాధారణ చాయ్‌వాలా జర్నీకి సంబంధించిన స్టోరీ.  బాక్సింగ్ లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించడానికి, MMA టైటిల్‌ను గెలుచుకోవడానికి అనేక అడ్డంకులు ఎదుర్కొంటాడు. లైగర్ రింగ్‌లోకి  ఎంటర్ అయ్యేటప్పుడు నత్తిగా మాట్లాడటం ఆశ్చర్యపరుస్తుంది.

లెజెండ్ మైక్ టైసన్ ఇంట్రడక్షన్ కూడా మెస్మరైజ్ చేస్తుంది. “నేను ఫైటర్‌ని” అని విజయ్ చెప్పినప్పుడు.. “నువ్వు ఫైటర్ అయితే, నేను ఏమిటి?”  టైసన్ బదులిస్తాడు. టైసన్ కిల్లర్ లుక్స్, ఫ్రేమ్స్ చాలా బాగుంటుాయి. దర్శకుడు పూరీ జగన్నాధ్ కాస్టింగ్ క్రూతో ఈ సినిమాను తెరకెక్కించాడు.  అంతర్జాతీయ ఐకాన్ మైక్ టైసన్‌ను ప్రాజెక్ట్‌లోకి తీసుకురావడం ద్వారా పూరి సక్సెస్ అయ్యాడు. విజయ్ దేవరకొండను మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో చూపించాడు. క్యారెక్టర్‌కి ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌ని తీసుకొచ్చి, విజయ్ తన లుక్స్, పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. టెక్నికల్‌గా ట్రైలర్‌ సాలిడ్‌గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ ఫస్ట్ క్లాస్. విభిన్న సౌండ్‌లతో కూడిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్-ప్యాక్డ్ షాట్స్ ఆకట్టుకుంటాయి. ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్ అపూర్వ మెహతా కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందించగా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇప్పటికే ఎన్నో అంచనాలు రేపుతున్న లైగర్ మూవీ 25 ఆగస్టు 2022న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.