Site icon HashtagU Telugu

Malla Reddy: మనిషికి జీవితం ఒకేసారి వస్తుంది, అందుకే ఎంజాయ్ చేస్తా: మల్లారెడ్డి

Malla Reddy Comments Mahend

Malla Reddy Comments Mahend

Malla Reddy: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ కుమారుడు భద్రారెడ్డిని మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు  మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చెయ్యడానికి తమ కొడకు సిద్ధమని స్పష్టం చేశారు. జగ్గారెడ్డి ఎంపీ టికెట్ కోసం రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారని చెప్పారు. తెలంగాణ రాజకీయాలతో పాటూ సోషల్ మీడియాలోనూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉండే తాజాగా మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనకు గోవాలో హోటల్ ఉందని, రాజకీయాలు నుంచి తప్పుకొంటే గోవా వెళ్లి ఎంజాయ్ చేస్తానని చెప్పారు. మనిషి జీవితం ఒకేసారి వస్తుందని, ఎంజాయ్ చేయాలంటూ మల్లారెడ్డి పేర్కొన్నారు. జగ్గారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా జగ్గారెడ్డి ఫోకస్ కావడం కోసమే తన పేరును వాడుకుంటున్నాడని, తన పేరు ఎత్తకపోతే ఆయన్ను ఎవరూ పట్టించుకోరని తెలిపారు. గతంలో రేవంత్ రెడ్డిని తిట్టిన మాటలు అందరికీ గుర్తే ఉన్నాయని గుర్తు చేశారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చిట్ చాట్‌లో భాగంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్లు.. మా కుటుంబం నుంచి మూడు పదవులు ఉండాలని అనుకున్నామని చెప్పారు.