Relationship Break: “ఒంటరినై పోయాను”.. నెగెటివ్ ఫీలింగ్ ను జయిద్దాం ఇలా!!

అయితే ఆందోళన చెందొద్దు. కలవరంలో మునిగి పోవద్దు. కలత చెందొద్దు. జీవితంలో చేదు అనుభవాలు కూడా ఒక భాగమని తెలుసుకోండి.

  • Written By:
  • Publish Date - September 14, 2022 / 08:30 AM IST

పెళ్లి తర్వాత విడాకులు తీసుకున్నారా?

లవర్ తో బ్రేకప్ అయిందా ?

ప్రేమ బంధం తెగిపోయిందా?

అయితే ఆందోళన చెందొద్దు. కలవరంలో మునిగి పోవద్దు. కలత చెందొద్దు. జీవితంలో చేదు అనుభవాలు కూడా ఒక భాగమని తెలుసుకోండి. చేదు అనుభవాలను తలుచుకుంటూ కుమిలిపోకుండా.. ధైర్యంతో మున్ముందుకు సాగితేనే జీవితం సార్ధకం అవుతుందని గ్రహించాలి. జీవితంలో ఒంటరినై పోయాను.. ఇక ఇంటికి ఏమని పోను అనే ఫీలింగ్ లో ఉన్నవాళ్లు మానసికంగా ఎలా సెల్ఫ్ మేనేజ్ చేసుకోవాలో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

* ఎమోషన్స్ ఎక్స్ ప్రెస్ చేయండి

జీవిత భాగస్వామి నుంచి దూరమైన ప్రభావం వ్యక్తుల్లో ఎమోషనల్ హెల్త్ పైనా కనిపిస్తుంది. దీంతో వారి భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం ఇబ్బంది గా మారుతుంది. ఇలాంటి సమయంలో వారు మానసిక బలాన్ని, మోటివేషన్ ను ఇచ్చే మేగజైన్స్, జర్నల్స్ ను చదవొచ్చు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ పొందొచ్చు. వాళ్ళతో మాట్లాడి నైతిక స్థైర్యాన్ని నింపే మాటలు వినాలి, వారి సూచనలు తీసుకోవాలి. మానసిక వైద్య నిపుణుడిని సంప్రదించాలి.

* హాబీకి జై కొట్టండి

బాగా టెన్షన్ లో ఉన్నప్పుడు హాబీని అమల్లోకి పెట్టె ప్రయత్నం చేయాలి. హాబీని ఆచరించే ప్రయత్నంలో ధ్యాస అంతా దానిపైకె మళ్లుతుంది. ఫలితంగా టెన్షన్ రిలీవ్ అవుతుంది. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

* నవ్వేయండి..ఏడ్చేయండి

ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకునే పరిస్థితి లేనప్పుడు వాటిని బయటకు ఎక్స్ ప్రెస్ చేయండి. ఆనందం అనిపిస్తే నవ్వేయండి. బాధగా అనిపిస్తే బిగ్గరగా ఏడ్చేయండి. ఫలితంగా టెన్షన్ రిలీవ్ అవుతుంది.

* నెగెటివిటీకి నో

జీవిత భాగస్వామి దూరం కావడం వల్ల మనసును కలత, ఆత్మ న్యూనతా భావన చుట్టుముడుతుంది. వాటిలో మునిగి ఆవేదనతో కుమిలిపోతుంటారు. జీవితంలో విజయాలకు దోహదపడిన అంశాలను గుర్తుకు తెచ్చుకోండి. సంతోషాన్ని ఇచ్చిన జీవిత క్షణాలు గుర్తుకు తెచ్చుకోండి. చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకోకండి. జరిగిన నష్టాన్ని పూడ్చలేమని గుర్తుంచుకోండి.

* అంతం కాదు ఆరంభం

జీవిత భాగస్వామికి దూరం అయినంత మాత్రాన భూమి బద్దలు కాదని తెలుసుకోండి. అదే జీవితానికి చివరి రోజు కాదని గుర్తుంచుకోండి. ఎవరి జీవితాలు వారికి సంబంధించినవి. మీ జీవితంలో మీకు సుఖ సంతోషాలు రాబోతున్నాయని ఆశావహ దృక్పథంతో ఉండండి. అందమైన జీవితాన్ని ఆస్వాదించండి.