Site icon HashtagU Telugu

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద మృతులకు ఊరట కల్పించిన ఎల్ఐసి.. ఆ సర్టిఫికెట్లు అవసరం లేదంటూ?

Odisha Train Accident

Odisha Train Accident

ఒడిశా రైలు ఘటన.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇది హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా కూడా ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ ఘటనపై స్పందిస్తూ విచారం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు మూడు రైలు సృష్టించిన విధ్వంసం కి వందల ప్రాణాలు గాల్లో కలిసిపోగా ఇంకా కొన్ని వందల ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నాయి. అంతేకాకుండా గంటకు మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది.

ఇది ఇలా ఉంటే ఒడిశా రైలు దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు భారతీయ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ బాసటగా నిలిచింది. ఇన్సూరెన్స్‌ క్లయిమ్‌ కోసం డెత్ సర్టిఫికేట్ అవసరాన్ని మినహాయించి, క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను సడలించనున్నట్లు ఎల్‌ఐసీ చైర్‌పర్సన్ సిద్ధార్థ మహంతి తెలిపారు. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం పట్ల ఎల్‌ఐసీ ఆఫ్ ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని మహంతి తెలిపారు. మృతులు, బాధితులకు బాసటగా నిలుస్తుందని, ఆర్థిక ఉపశమనం అందించడానికి క్లయిమ్ సెటిల్‌మెంట్‌ లను వేగవంతం చేస్తుందని చైర్‌పర్సన్ వెల్లడించారు.

ఎల్‌ఐసీ పాలసీల క్లయిమ్‌ దారులు, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీ దారుల కష్టాలను తగ్గించడమే దీని లక్ష్యం అని ఆమె తెలిపారు. రిజిస్టర్డ్ డెత్ సర్టిఫికేట్‌లకు బదులుగా రైల్వే అధికారులు, పోలీసులు, ఏదైనా రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రచురించిన మరణాల జాబితాను పాలసీదారుల మరణానికి రుజువుగా అంగీకరించనున్నట్లు ఎల్‌ఐసీ చైర్‌పర్సన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే క్లయిమ్ సంబంధిత సందేహాలకు నివృత్తికి, హక్కుదారులకు సహాయం అందించడానికి డివిజనల్, బ్రాంచ్ స్థాయిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సంగతి పక్కన పెడితే ఈ రైల్వే ఘటనలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వందలాది మందికి రక్తదానం చేయడం కోసం కొన్ని వందలాదిమంది హాస్పిటల్ లో క్యూలు కట్టారు.

Exit mobile version