Site icon HashtagU Telugu

Twitter : ట్విట్టర్ లో మాయమైన ‘W’ అక్షరం..

Twitter..

Letter 'w' Disappeared On Twitter..

Twitter : ఎలాన్ మస్క్ … పెద్దగా పరిచయం అక్కర్లేని పేరిది. టెక్నాలజీని వాడుకోవడంలో ఎలాన్ మస్క్ తర్వాతనే ఎవరైనా. ఈ మధ్యే ట్విట్టర్ ని కొనుగోలు చేసి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతున్నాడు. ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా… ఒక్కోసారి మాస్క్ తీసుకునే నిర్ణయాలు చాలా సరదాగా సిల్లీగా అనిపిస్తాయి. ఈ మధ్య ట్విట్టర్ విషయంలో ఎలాన్ మస్క్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. మొన్నటికి మొన్న ట్విట్టర్ అధికారిక లోగో పిట్టను మార్చి.. ఆ స్థానంలో క్రిప్టోకరెన్సీ డోజీ కాయిన్ మార్చేశాడు. మూడు రోజుల్లోనే కుక్క లోగోను మార్చేసి మళ్లీ బుల్లిపిట్ట లోగోను ఉంచాడు. ఇక తాజాగా ట్విట్టర్ పేరునే మార్చేశాడు. నిజానికి ట్విట్టర్ స్పెల్లింగ్ TWITTER అయితే ప్రస్తుతం W వర్డ్ ఎగిరిపోయింది. ప్రస్తుతం TITTER గా మార్చేశాడు మస్క్.

నిజానికి ట్విట్టర్ పేరుని మార్చకూడదు. చట్టప్రకారంగా మార్చే అధికారం లేకపోవడంతో W లెటర్ ని బ్లర్ చేసి కనిపించకుండా కేవలం TITTER లెటర్స్ కనపడేలా మార్చేశాడు. కంపెనీ మెయిన్ ఆఫీస్ ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో లో సైన్ బోర్డు మీద twitter కి బదులు titter ని ఉంచాడు. ఎలాన్ మస్క్ నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కొందరు ఫన్నీగా కామెంట్స్ పెడుతుంటే.. మరికొందరు మస్క్ చేష్టలకు అదుపు లేకుండా పోతుంది అంటూ మండిపడుతున్నారు.

Also Read:  Amarnath Reaction: తెలంగాణ బిడ్ దాఖలు పై మంత్రి అమర్నాథ్ రియాక్షన్..

Exit mobile version