Site icon HashtagU Telugu

Social Media : ‘సోషల్ మీడియాను మంచికే వాడుదాం’ అంటూ సరికొత్త క్యాంపెయిన్

#awakenthe4thmonkey

#awakenthe4thmonkey

ఇటీవల సోషల్ మీడియా (Social Media) వాడకం ఎంతగా పెరిగిందో తెలియంది కాదు. అయితే చాలామంది సోషల్ మీడియా ను మంచి కంటే చెడుకు ఎక్కువగా వాడుతున్నారు. దీంతో అనేక అనర్దాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఫేక్ ప్రచారం (Fake Campaign) చేస్తూ మనుభవాలు దెబ్బతిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో సోషల్ మీడియా పై సరికొత్త క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ప్రభుత్వం సామాజిక బాధ్యతను కాపాడుతూ “సోషల్ మీడియాను మంచికే వాడుదాం” (Let’s use social media for good) అనే క్యాంపెయిన్‌ను ప్రారంభించింది.

ఈ ప్రచారంలో భాగంగా వివిధ నగరాల్లో పెద్ద హోర్డింగ్‌లు మరియు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ క్యాంపెయిన్‌లో గాంధీజీ సూక్తి “‘చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు'” ఆధారంగా సోషల్ మీడియాలో చెడు పోస్టులను నిరసిస్తూ ప్రచారం మొదలుపెట్టారు. “పోస్ట్ నో ఈవిల్” అనే కాన్సెప్ట్‌తో ఒక కొత్త “ఫోర్త్ మంకీ” బొమ్మను ఏర్పటు చేసారు. విజయవాడ-గుంటూరు దారిలో తాడేపల్లి హైవే, అమరావతి, తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలలో తెలుగు మరియు ఆంగ్ల భాషల్లో ఈ హోర్డింగ్స్ ఏర్పాటు చేసారు. ఈ ప్రచారం పై ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. ఇకనైనా సోషల్ మీడియా ను మంచికే ఉపయోగించాలని అంత కోరుతున్నారు.

Read Also : Chhatrapati Shivaji Statue : చైనా బార్డర్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం.. ఎందుకు ?