Cryopreservation: మళ్ళీ బ్రతికిస్తాం.. చనిపోయిన వారిని అలా చేయడమా?

"పునర్జన్మ" అంటే మీకు తెలిసే ఉండొచ్చు. చనిపోయిన తరువాత అది నిజంగా మళ్ళీ జీవం పొందడం సాధ్యమేనా? అసలు ఆ ఆలోచన నిజంగా ఆచరణ సాధ్యమేనా?

Published By: HashtagU Telugu Desk
Cryopreservation Applications And Advances 349021 640x360

Cryopreservation Applications And Advances 349021 640x360

Cryopreservation: “పునర్జన్మ” అంటే మీకు తెలిసే ఉండొచ్చు. చనిపోయిన తరువాత అది నిజంగా మళ్ళీ జీవం పొందడం సాధ్యమేనా? అసలు ఆ ఆలోచన నిజంగా ఆచరణ సాధ్యమేనా? అంటే అవుననే అంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు. దాదాపుగా అన్ని అంశాలపై పరిశోధన చేస్తున్న మానవుడు.. ఇప్పుడు పునర్జన్మ పై చేసే ప్రయత్నాలు కూడా ఆశ్చర్యకరమైన ఫలితాలు ఇచ్చాయని, ఇదే సాధ్యమైతే.. భవిష్యత్తు మనం ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు నిపుణులు. అసలు ఆ విషయమేంటో మీరే చూడండి.

ఇటీవల పునర్జన్మ పై పరిశోధన చేసిన జర్మన్ వైద్య బృందం వినూత్నమైన ఫలితాలు వచ్చాయని పేర్కొంది. దీనికోసం మృతదేహాలను అతి శీతలంగా ఉండే పరిస్థితుల్లో భద్రపరుస్తున్నారట. వాటికి ఎప్పటికైనా ప్రాణం పోస్తామని ధీమాగా ఉన్నారట. జర్మనీలో బెర్లిన్ కు చెందిన టుమారో బయోస్టాటిస్ స్టార్టప్ కూడా పనిచేస్తుంది. వైద్య రంగంలో తగిన పురోగతి సాధించిన తర్వాత.. మరణానికి కారణాల ఆధారంగా చికిత్స చేసి తిరిగి మళ్ళీ జీవించేలా చేయాలనీ అన్నది ఆ సంస్థ ఉద్దేశ్యం.

శవాలను, శవ భాగాలను చాలా కాలం పాటు చెడిపోకుండా ఉండడం వాటిని అత్యంత చల్లగా ఉండే ప్రదేశాల్లో భద్రపరచడం వల్ల సాధ్యం అవుతుంది. ఈ పద్దతిని “క్రయో ప్రిజర్వేషన్” అని పిలుస్తారు. ప్రస్తుతం ఇలాంటి ప్రిజర్వేటివ్ సేవలు చాలా తక్కువ సంస్థలు అందిస్తున్నాయి. స్విట్జర్లాండ్ లోని రాప్జ్ పట్టణంలో “యూరోపియన్ బయోస్టాసిస్” సంస్థ ఈ దిశగా పరిశోధనలు చేయడానికి క్రయో ప్రిజర్వేషన్ సేవలు అందిస్తుంది. ఈ మధ్య దీనికి శవాల తాకిడి పెరుగుతున్నట్టు సమాచారం.

క్రయో ప్రిజర్వేషన్ విధానంలో కణాలు, కణజాలంతో పాటు మెదడును కూడా చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తారు. అయితే అవయవాలను ముందుగా -196 డిగ్రీ సెల్సియస్ వద్ద చల్లబరిచి ఉంచుతారు. ఆ తర్వాత లిక్విడ్ నైట్రోజెన్ ఉన్న ట్యాంకులో వాటిని భద్రంగా ఉంచుతారు. అయితే నిల్వ ఉంచే విషయంలో స్పష్టత ఉన్నప్పటికీ, తిరిగి ఎలా ప్రాణం పోస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. చూద్దాం భవిష్యత్తు పరిశోధనలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయో.

  Last Updated: 09 Feb 2023, 08:18 PM IST