Site icon HashtagU Telugu

Leopard: శ్రీశైలంలో చిరుత.. భక్తులు అలర్ట్

Leopard

Leopard

శుక్రవారం రాత్రి రింగ్‌రోడ్డు రుద్రపార్కు సమీపంలో చిరుతపులి కనిపించడంతో శ్రీశైలంలోని భక్తులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒక వ్యక్తి రుద్రా పార్క్ సమీపంలో చిరుతపులిని గుర్తించాడు. అతను తన మొబైల్ సహాయంతో చిరుత కదలికలను బంధించడానికి ప్రయత్నించాడు. ఆ వ్యక్తి కదలికలను గమనించిన చిరుతపులి అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది. సమాచారం అందుకున్న అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు. ఈ ఘటనతో స్థానికులు, భక్తుల్లో భయాందోళనలు నెలకొనడంతో చిరుతను పట్టుకోవాలని అటవీశాఖాధికారులను కోరుతున్నారు.