Site icon HashtagU Telugu

Leopard: భారత్ సరిహద్దుల్లో చిరుతపులి… హైఅలర్ట్ ప్రకటించిన అధికారులు!

Leopard In Night Pb 1679225422

Leopard In Night Pb 1679225422

Leopard: అంతర్జాతీయ సరిహద్దులు ఎప్పుడూ వేల మంది పారా మిలటరీ బలగాలతో గస్తీతో మోహరించి ఉంటాయి.చీమ చిటుక్కుమన్నా, హై అలర్ట్ అవుతారు. ఎక్కడా పొరపాటు లేకుండా పర్యవేక్షణ ఉంటుంది. అటువంటి చోటుకు ఓ చిరుతపులి చొరబాటు కలకలం సృష్టించింది.

జమ్మూకశ్మీ ర్ లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు నుంచి ఇది ప్రవేశించినట్టు పోలీసులు వెల్లడించారు. బీఎస్ఎఫ్ బోర్డర్ అవుట్ పోస్ట్ నర్సరీకి సమీపంలో ఉన్న ఫెన్సిం గ్ ను దాటుకుంటూ ఓ చిరుత మన సరిహద్దుల్లోకి ప్రవేశించడం సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది.బీఎస్ఎఫ్ నుంచి సమాచారం అందడంతో అన్ని బోర్డర్ పోలీస్ పోస్టులను అప్రమత్తం చేశారు. ఆయా ప్రాంతాల్లోని స్థానికులను అప్రమత్తం చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరీ ముఖ్యంగా రాత్రి పూట ఇంకా జాగ్రత్తగా ఉండలని విజ్ఞప్తి చేసినట్టు అధికారులు తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులు ఆ చిరుతను పట్టుకొనేందుకు చర్యలు చేపట్టారు.మరోవైపు స్థానికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని నర్సరీ పోస్ట్ సమీపంలోని కేసో, బరోట్టా, లగ్వా ల్, పఖారీ, పరిసర గ్రామాలకు పోలీసు బృందాలను తరలించినట్టు అధికారులు తెలిపారు.