Site icon HashtagU Telugu

Leopard: రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి

Leopard

Leopard

కాన్పూర్‌లో ఓ చిరుతపులి శవమై కనిపించింది. కాన్పూర్‌లోని న్యూ చౌక్ ప్రతాపూర్ గ్రామంలోని పొలాల్లో హైవే వెంబడి చిరుత మృతదేహం కనిపించింది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు చిరుత మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు. నాలుగు-ఐదు సంవ‌త్స‌రాల వ‌య‌సు క‌లిగిన మగ చిరుతపులి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపామ‌ని కాన్పూర్ జిల్లా అటవీ అధికారి తెలిపారు. , ఇది వాహనం ఢీకొనడంతో తలకు గాయం కారణంగా చనిపోయిందని తాము ప్రాథ‌మికంగా నిర్థార‌ణ‌కు వ‌చ్చామ‌న్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పొలం పక్కనే ఉన్న హైవేపై చిరుతపులిని వాహనం ఢీకొట్టింది. తలకు గాయం అయిన తరువాత చిరుతపులి పొలాల్లో తిరిగిన‌ట్లు తెలుస్తుంది.తీవ్ర‌గాయాలు కావ‌డంతో అలా వెళ్తు పోలాల్లో మృతి చెందింది.