హైదరాబాద్ (Hyderabad) రాజేంద్రనగర్(Rajendranagar)లో మరోసారి చిరుత (Leopard ) ప్రత్యక్షమైంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తెల్లవారుజామున మార్నింగ్ వాకింగ్ చేస్తున్న వారికి చిరుత కనిపించడంతో వారు భయబ్రాంతులకు గురయ్యారు. చిరుత జయశంకర్ విగ్రహం వద్దకు చేరి, అక్కడి నుంచి చెట్లలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత వారు చిరుత పాదముద్రలు కూడా గుర్తించారు. రాజేంద్రనగర్‌లో చిరుత ప్రత్యక్షమవడం కొత్త విషయం కాదు. 2020లో హిమాయత్ సాగర్ వద్ద చిరుత దాడి చేసి ఆవును చంపింది. చిరుత దాడి చేస్తున్న వీడియో అప్పట్లో పెద్ద కలకలం సృష్టించింది. చిరుత వెళ్ళిపోవడానికి, ఆవు యజమాని డప్పు శబ్దం చేశాడు.
Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం అందజేత
ప్రస్తుతం రాజేంద్రనగర్‌లో చిరుత కనిపించిందనే వార్త తెలిసి ఆ ప్రాంత వాసులు భయపడుతున్నారు. విశ్వవిద్యాలయం చుట్టూ ఉన్న నివాసితులు ఎప్పుడు చిరుత దాడి చేస్తుందో అని భయంతో నివసిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు, అటవీ అధికారులు చిరుత కదలికలపై దృష్టి పెట్టారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా చిరుతలు, పులులు అడవులను వదిలి, ప్రజల ప్రాంతాల్లో ప్రవేశించి కలకలం సృష్టిస్తున్నాయి. ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి, కుమురం భీం ఆసిఫాబాద్ వంటి ప్రాంతాల్లో చిరుతలు కనిపిస్తున్నాయి.