Site icon HashtagU Telugu

Ahobilam: అహోబిలంలో ‘చిరుత’ కలకలం.. భక్తుడిపై దాడి!

Chirutha

Chirutha

తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పులులు, చిరుతల సంచారం పెరిగిపోతోంది. ముఖ్యంగా నల్లమల అడవుల్లో వీటి సంఖ్య బాగా పెరిగింది. ఇప్పటికే శ్రీశైలం రహదారులపై పెద్ద పులులు సంచరిస్తుండగా, తాజాగా కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో చిరుత కలకలం రేపింది. నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి చిరుత వీధి కుక్కపై దాడి చేయబోయింది. చిరుతను గమనించి ఒక్కసారిగా పరుగు పెట్టింది. ఆ సంఘటన మరువకముందే తాజాగా అహోబిలంలో పావన నరసింహస్వామి ఆలయానికి కాలినడకన వెళ్తున్న భక్తుడిపై చిరుత దాడి చేసింది. దర్శనం కోసం మెట్ల మార్గం ద్వారా వెళ్తున్న సమయంలో చిరుత ఓ వ్యక్తిపై దాడి చేసింది. దీంతో అలర్ట్ అయిన అతడు తప్పించుకున్నాడు. ఈ సంఘటనలతో చాలామంది భక్తులు మెట్లమార్గం వైపు వెళ్లేందుకు జంకుతున్నారు.