తిరుపతిలోని జూపార్క్ రోడ్ వద్ద ఓ చిరుతపులి కలకలం రేపింది. సైన్స్ సెంటర్ వద్ద సడెన్ గా చిరుతపులి ఒక వ్యక్తి పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. స్థానికులు, అధికారులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగి మునికుమార్ అని గుర్తించారు.
Delhi Assembly Elections : ఆయనే బీజేపీ సీఎం అభ్యర్థి : కేజ్రీవాల్
గతంలో కూడా చిరుతల దాడుల్లో పలువురి ప్రాణాలు పోవడం , గాయాలు కావడం వంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎప్పటికప్పుడు తిరుమల క్షేత్రంలో చిరుతల దాడులు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే అటవీ అధికారులు నిత్యం కాపలా కాస్తూ, భక్తులను అలర్ట్ చేస్తుంటారు.