Site icon HashtagU Telugu

Lata Cremated: ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’కు కన్నీటి వీడ్కోలు!

Lata

Lata

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆదివారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 92. నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలవబడే గాయని అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ముంబైలోని శివాజీ పార్క్‌లో జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ, షారుక్ ఖాన్, రణబీర్ కపూర్, విద్యాబాలన్ తదితరులు మంగేష్కర్‌కు నివాళులర్పించారు.

పండిట్ దీనానాథ్ మంగేష్కర్, శేవంతి మంగేష్కర్ ల కుమార్తె, లత సంగీత కుటుంబానికి చెందినవారు. ఆమె తండ్రి సుప్రసిద్ధ మరాఠీ సంగీతకారుడు. థియేటర్ ఆర్టిస్ట్. ఆమె మొదట తన తండ్రిచే ట్రైనింగ్ పొందారు. తరువాత అతని అనేక నాటకాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది.

లతా మంగేష్కర్ తన మొదటి హిందీ పాట “మాతా ఏక్ సపూత్ కి దునియా బాదల్ దే తూ” అనే మరాఠీ ఫీచర్ గజాభౌ కోసం రికార్డ్ చేసారు, అది 1943లో విడుదలైంది. తర్వాత, ఆమె హిందీ సంగీత పరిశ్రమలోని కొన్ని ప్రముఖ వ్యక్తులతో కలిసి పనిచేసింది, అనిల్ బిస్వాస్, శంకర్ జైకిషన్, నౌషాద్ అలీ మరియు SD బర్మన్ వంటి వారితో సహా. హిందీ, బెంగాలీ, మరాఠీ మరియు ఇతర ప్రాంతీయ భాషలలోని పాటలకు ఆమె తన గాత్రాన్ని అందించింది. ఆమె దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, భారతరత్న, పద్మవిభూషణ్ మరియు పద్మభూషణ్‌లతో పాటు అనేక జాతీయ మరియు ఫిల్మ్ ఫేర్ అవార్డులతో సత్కరించబడింది.