Hyderabad: పైపులైన్ లీకేజ్ ఎఫెక్ట్, రేపు హైదరాబాద్ లో తాగునీరు బంద్

  • Written By:
  • Publish Date - December 12, 2023 / 11:34 AM IST

Hyderabad: డిసెంబరు 13 ఉదయం 5 గంటల నుండి నగరంలోని కొన్ని ప్రాంతాలకు 24 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోతుంది. శాస్త్రిపురం, బండ్లగూడ, భోజగుట్ట, షేక్‌పేట, జూబ్లీహిల్స్‌లోని కొన్ని ప్రాంతాలు, ఫిలింనగర్ ప్రశాసన్‌నగర్ నీటి సరఫరా నిలిచిపోనుంది. అంతేకాదు.. లాలాపేట్, సాహెబ్‌నగర్, ఆటోనగర్, సరూర్‌నగర్, సైనిక్‌పురి మరియు మౌలాలిలో కూడా సరఫరా నిలిచిపోనుంది.

గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్, బుద్వేల్, బోడుప్పల్, భరత్‌నగర్, పీర్జాదిగూడ, కిస్మత్‌పూర్ తదితర ప్రాంతాల్లో 24 గంటల పాటు నీటి సరఫరా కు అంతరాయం  ఏర్పడనుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS&SB) ప్రకారం.. కోదండాపూర్ పంపింగ్ స్టేషన్‌లో తాగునీటి లీకేజీని పూడ్చడానికి నీటి సరఫరా నిలిపివేయబడుతుంది.