హైదరాబాద్‌లోని ఎల్పీనగర్ అండర్ పాస్‌ను ఈరోజు తెలంగాణ మంత్రి మంత్రి కేటీఆర్ ప్రారంభంచనున్నారు. దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఎల్పీనగర్ అండర్ పాస్‌ను నిర్మించారు. దీనితో పాటు 29కోట్ల వ్యయంతో నిర్మించిన బైరామల్ గూడ ఫ్లైఓవర్‌ను కూడా ఈరోజు మంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఒకేసారి ఈ రెండు అండర్ పాస్‌లు అందుబాటులోకి రానుండటంతో హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ సమస్య మరింత తీరే అవకాశం ఉంది.
హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య గురించి అందరికీ తెలిసిందే. భాగ్యనగర వాసులను ఏళ్ళ నుంచి ఈ ట్రాఫిక్ సమస్య సతాయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలను బయటపడేసేందుకు హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నారు. అందులో భాగంగానే ఎల్బీ నగర్‌లోని అండర్ పాస్‌తో పాటు బైరామల్ గూడ ఫ్లై ఓవర్ ను నిర్మించారు. దీనివల్ల భాగ్యనగర్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. బైరామల్ గూడ ఫ్లైఓవర్ నిర్మించడంతో శంషాబాద్ విమానాశ్రయం చేరుకోవడం మరింత సులువు అవుతుంది.