Site icon HashtagU Telugu

Hyderabad : ప్రారంభానికి సిద్ధ‌మైన ఎల్బీనగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్

LB Nagar RHS flyover

LB Nagar RHS flyover

స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డిపి)లో భాగంగా అభివృద్ధి చేసిన ఎల్‌బి నగర్ ఆర్‌హెచ్‌ఎస్ (కుడివైపు) ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఎల్‌బి నగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని తెలిపారు . హయత్‌నగర్ నుండి దిల్‌సుఖ్‌నగర్ వైపు ట్రాఫిక్ త‌గ్గ‌నుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) 32 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవ‌ర్ అభివృద్ధి చేసింది. LB నగర్ RHS ఫ్లైఓవర్ 760 మీటర్ల పొడవుతో 380 మీటర్ల పొడవు మరియు 12 మీటర్ల వెడల్పుతో ఉంది.