Malreddy Ram Reddy Arrest: కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రాంరెడ్డి అరెస్ట్

ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మల్ రెడ్డి రాంరెడ్డిని (Malreddy Ram Reddy) పోలీసులు అరెస్ట్ చేసారు. బలవంతంగా పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనం ఎక్కించారు.

Congress Leader Malreddy Ram Reddy Arrest : ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మల్ రెడ్డి రాంరెడ్డిని (Malreddy Ram Reddy) పోలీసులు అరెస్ట్ చేసారు. బలవంతంగా పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనం ఎక్కించారు.

హస్థినపురం డివిజన్ లోని ఇంద్రప్రస్త కాలనీ ఫేజ్-2 లో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి (Malreddy Ranga Reddy) గారి హయాంలో పదిహేను సంవత్సరాల క్రితం కాలనీ వాసులు 50 శాతం గవర్నమెంట్ నిధులు మరియు 50 శాతం వెల్ఫేర్ అసోసియేషన్ సొంత నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మించుకున్నారు. అయితే ఇటీవల కాలంలో కమ్యూనిటీ హాల్ ని కబ్జా చేసి GHMC వార్డ్ ఆఫీస్ గా మార్చుతున్న క్రమంలో రాంరెడ్డి నిరసన తెలపగా పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ కమ్యూనిటీ హాల్ ని కాలనీ వాసులు యోగా ప్రోగ్రామ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, మతపరమైన పండుగలు, పెళ్లిళ్లు మరియు వివిధ సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు.

ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బినామీ పేర్లతో 58-59 జీవో కింద అమ్ముకుంటూ, కాలనీ వాసులు స్వంతంగా నిర్మించుకున్న కమ్యూనిటీ హాళ్లను వార్డ్ ఆఫీస్ లుగా మార్చడమేంటి అని ప్రేశ్నించారు. అవసరమైతే ప్రభుత్వ నిధులతో కొత్తవి కట్టాలి గానీ, ఉన్నవాటిని మార్చడమేంటి అని ప్రశ్నిస్తూ సామరస్యంగా వ్యతిరేకిస్తున్న ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మల్ రెడ్డి రాంరెడ్డిని మరియు తదితరులను అరెస్ట్ చేసి బాలాపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ అరెస్టుల పై స్థానికులు, కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు.

Also Read:  Mahanadu 2023 : లోకేష్ పై మ‌హానాడు ఫోక‌స్, వ్యూహాత్మ‌కంగా ప‌దోన్న‌తికి బ్రేక్