Site icon HashtagU Telugu

Chandrababu : కాసేపట్లో చంద్రబాబుతో లాయర్ సిద్ధార్థ్ లూథ్రా ములాఖత్

Cbn Lawyer Comments

Cbn Lawyer Comments

సిల్క్‌డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో రిమాండ్‌లో మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుని లాయ‌ర్ సిద్ధార్థ్ లూథ్రా క‌ల‌వ‌నున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును క‌లిసి న్యాయ‌ప‌ర‌మైన అంశాల‌ను మాట్లాడ‌నున్నారు. రిమాండ్‌తో పాటు ఇప్ప‌టికే ప‌లు కేసుల‌కు సంబంధించి ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ల‌పై హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. ఈ పిటిష‌న్‌ల‌కు సంబంధించిన హైకోర్టు వాయిదా వేసింది. దీనికి సంబంధించి త‌దుప‌రి కార్య‌చ‌ర‌ణ‌పై చంద్ర‌బాబుతో లాయ‌ర్ లూథ్రా చ‌ర్చించ‌నున్నారు. అయితే చంద్ర‌బాబుతో ములాఖ‌త్‌కు ముందు లాయ‌ర్ సిద్ధార్థ లూథ్రా త‌న ట్విట్ట‌ర్‌లో గురుగోవింద్ సింగ్ వ్యాఖ్య‌ల‌ను పోస్ట్ చేశారు