Lavanya Tripathi: జూలై 15న లావణ్య త్రిపాఠి ‘హ్యాపీ బర్త్‌డే’

మత్తువదలరా చిత్రంతో ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం హ్యాపీ బర్త్‌డే.

Published By: HashtagU Telugu Desk
Happy Birthday

Happy Birthday

మత్తువదలరా చిత్రంతో ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం హ్యాపీ బర్త్‌డే. ప్రముఖ కథానాయిక లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తుంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషొర్, గుండు సుదర్శన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు చిత్ర నిర్మాతలు.

విడుదల తేదీతో కూడిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ కూడా అందర్ని ఆకట్టుకుంటుంది. చేతిలో గన్స్‌తో ఎగురుతున్నట్లు లావణ్యత్రిపాఠి ఈ పోస్టర్‌లో కనిపించడంతో అందరిలోనూ ఈ చిత్ర కథపై ఆసక్తి పెరిగింది. ఈ పోస్టర్ చూస్తే మాత్రం తప్పకుండా ఇది రితేష్ రానా దర్శకత్వంలో రానున్న మరో వినూత్న హిలేరియస్ ఎంటర్‌టైన్‌ర్‌గా కనిపిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, డిఓపీ: సురేష్ సారంగం, ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్, ఫైట్స్: శంకర్ ఉయ్యాల, కాస్ట్యూమ్ డిజైనర్: తేజ్ ఆర్, లైన్ ప్రాడ్యూసర్: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబా సాయి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాల సుబ్రమణ్యం కేవీవీ, ప్రొడక్షన్ కంట్రోలర్: సురేష్ కుమార్ కందుల, మార్కెటింగ్: ఫస్ట్‌షో, పీఆర్‌ఓ; వంశీ- శేఖర్ , మడూరి మధు, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: రితేష్ రానా.

  Last Updated: 06 May 2022, 12:50 PM IST