Site icon HashtagU Telugu

IPL 2022: రాజస్థాన్ బౌలింగ్ కోచ్‌గా యార్కర్ల స్పెషలిస్ట్‌

Lasith Imresizer

Lasith Imresizer

ఐపీఎల్ 2022 సీజన్‌కు సమయం దగ్గర పడుతుండడంతో ఫ్రాంచైజీలన్నీ తమ సన్నాహాలను ముమ్మరం చేశాయి. ఆటగాళ్ళకు ట్రైనింగ్ క్యాంపులు, కోచింగ్ స్టాఫ్ నియామకాలు, స్పాన్సర్ల వేట.. ఇలా అన్నింటిలోనూ బిజీగా బిజీగా దూసుకెళుతున్నాయి. తాజాగా సంజు శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ రాయల్స్ జట్టులో జ‌ట్టులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. శ్రీలంక బౌలింగ్ దిగ్గజం, ముంబై ఇండియన్స్ జట్టు మాజీ పేసర్ లసిత్ మలింగ బౌలింగ్‌ కోచ్‌గా నియమించుకుంది. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది. మలింగ వంటి దిగ్గజ బౌలర్‌ నేతృత్వంలో రాజస్తాన్‌ రాయల్స్ బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ప్రధాన కోచ్‌గా కుమార సంగక్కర వ్యవహరిస్తుంటే అతని సిఫార్సుతోనే మలింగ ఈ బాధ్యతలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇక శ్రీలంక తరఫున ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలు చేసిన మలింగకు మనదేశంలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్‌ 2013, 2015, 2017, 2019 టైటిల్స్ గెలవడంలో మలింగ ముఖ్య పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో మలింగా మొత్తం 122 మ్యాచ్‌లలో 170 వికెట్లు తీసి ఈ మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే రిటైర్మెంట్ తర్వాత ముంబై జట్టులోనే సహాయక సిబ్బందిలో కొనసాగుతాడని చాలా మంది భావించారు. ఇప్పుడు అనూహ్యంగా రాజస్థాన్ మలింగ సేవలను వినియోగించుకునేందుకు ముందే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భిన్నమైన బౌలింగ్ శైలితో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టే మలింగ కోచింగ్‌ రాజస్థాన్ యువ పేసర్లకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు.

ఇదిలాఉంటే.. ఐపీఎల్2022 సీజన్ లో టైటిల్ గెలవడమే టార్గెట్ గా మెగా వేలం లో ప్రణాళిక ప్రకారం ఆటగాళ్లను కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్ ఈసారి దుమ్మురేపాలని భావిస్తోంది. సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ ను రిటైన్ చేసుకోగా..మెగా వేలంలో రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చహల్, రియాన్ పరాగ్ లను కొనుగోలు చేసింది.