Site icon HashtagU Telugu

Yediyurappa’s helicopter: యడ్యూరప్ప కు తప్పిన ప్రమాదం.. ల్యాండింగ్ సమస్యతో గాల్లో చక్కర్లు కొట్టిన హెలికాప్టర్

Whatsapp Image 2023 03 06 At 3.58.34 Pm (1)

Whatsapp Image 2023 03 06 At 3.58.34 Pm (1)

ప్లాస్టిక్ సంచుల కారణంగా హెలికాప్టర్ ల్యాండింగ్ కు సమస్య ఏర్పడింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్. యడియూరప్ప హెలికాప్టర్ కలబురగి జిల్లా జేవర్గి పట్టణ శివార్లలో ల్యాండింగ్‌ అవుతున్న సమయంలో ఈ ఇబ్బంది కలిగింది. విజయ్ సంకల్ప్ యాత్రలో భాగంగా పాల్గొనేందుకు యడ్యూరప్ప పట్టణానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అక్కడ తాత్కాలిక హెలిప్యాడ్‌ను నిర్మించారు. అయితే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయానికి ప్లాస్టిక్ సంచులు ఎగరడం ప్రారంభించాయి. పైలట్ ల్యాండింగ్‌ను ఆపడంతో హెలికాప్టర్ గాలిలో చక్కర్లు కొట్టింది. అనంతరం హెలికాప్టర్‌ను అదే స్థలంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ నిర్లక్ష్యంపై స్థానిక అధికారులు విచారణ జరుపుతున్నారు.