Site icon HashtagU Telugu

Councillor: మహబూబాబాద్ లో కౌన్సిలర్ దారుణ హత్య!

Counciller

Counciller

తెలంగాణలోని మహబూబాబాద్ కు చెందిన ఓ స్వతంత్ర కౌన్సిలర్‌ను పట్టపగలు పట్టిపాక రోడ్డులో గురువారం గొడ్డలితో హత్య చేయడంతో పలువురికి వెన్నులో వణుకు పుట్టించింది. మున్సిపాలిటీలోని ఎనిమిదో వార్డు నుంచి ఎన్నికైన బానోత్ రవి నాయక్ (34) మృతి చెందాడు. రవి ఏదో పనికి వెళ్లి బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. దుండగులు అతని ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు నుంచి ట్రాక్టర్‌తో ఢీకొట్టినట్లు సమాచారం. అనంతరం ఆ వెనుకే ఉన్న కారులో వెంబడించిన మరో ముగ్గురు అతడిపై విచక్షణా రహితంగా గొడ్డళ్లతో దాడి చేసి ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. ఇది గమనించిన కొందరు బాటసారులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడికి తరలించగానే కౌన్సిలర్ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.