Lakhpati Didi Yojana: దేశంలోని మహిళల ఆర్థిక సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. మహిళలు స్వయంగా ఆదాయ వనరులు ఏర్పరచుకుని, ఆర్థికంగా స్వావలంబిగా మారాలనే ఉద్దేశంతోనే 2023లో లఖ్పతి దీదీ యోజనను ప్రారంభించింది. ఇది నైపుణ్యాభివృద్ధిపై దృష్టిసారించిన శిక్షణా కార్యక్రమం. ఈ పథకం కింద మహిళలకు వ్యాపార సంబంధిత శిక్షణతో పాటు, వారి స్వంతంగా ఉపాధి ప్రారంభించేందుకు వడ్డీ లేని రుణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు.
2024–25 మధ్యంతర బడ్జెట్‌లో భాగంగా లఖ్పతి దీదీ యోజన ద్వారా దాదాపు 3 కోట్ల మంది మహిళలకు రుణం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అర్హత పొందిన మహిళలకు రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం మంజూరు చేయనున్నారు. ఈ పథకం ద్వారా వారికి లభించే శిక్షణల్లో ఎల్ఈడీ బల్బుల తయారీ, పశుపోషణ, పుట్టగొడుగుల సాగు వంటి ప్రాథమిక పరిశ్రమలు ఉన్నాయి. ఇవి పూర్తయిన తర్వాత ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్, ఆన్‌లైన్ వ్యాపారం వంటి అంశాల్లో నైపుణ్యాలను పెంపొందించనున్నారు.
Tollywood : సినీ పరిశ్రమలో సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు
ఈ స్కీమ్‌లో భాగస్వామ్యం కావాలంటే, దరఖాస్తుదారులు తమ జిల్లా మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలి. అక్కడ లభించే ఫారమ్‌ను పూరించి, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, SHG సభ్యత్వ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఫోన్ నంబర్, పాస్‌పోర్ట్ ఫోటో వంటి అవసరమైన డాక్యుమెంట్లను జత చేసి సమర్పించాలి. సంబంధిత అధికారులు దరఖాస్తును పరిశీలించి అర్హత నిశ్చయించిన తరువాత రుణాన్ని మంజూరు చేస్తారు.
మహిళలకు స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థలో వారి పాత్రను పెంచేలా ఈ పథకం కొనసాగుతోంది. వారి భవిష్యత్తు మెరుగుపడేందుకు లఖ్పతి దీదీ యోజన ఒక బలమైన ఆధారంగా నిలుస్తోంది.
Bengaluru Stampede : కోహ్లీ పై కేసు ఫైల్..లండన్ కు చెక్కేసాడా..?