Lagacharla Incident: ఫార్మా కంపెనీ భూసేకరణపై వివాదాల నిమిత్తం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జటోతు హుస్సేన్, డైరెక్టర్ పీకే రెడ్డి, అశోక్‌కుమార్ తదితరులు సోమవారం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లను సందర్శించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు లగచర్లకు చేరుకుని, గిరిజన సంఘాలు , గ్రామస్థులతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడి, ఆ తర్వాత గిరిజనులపై పోలీసుల వ్యవహారం గురించి వివరాలు సేకరిస్తారు. అనంతరం సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగారానికి చేరుకుని రిమాండ్‌లో ఉన్న వ్యక్తులను కలుసుకుంటారు. ఈ పర్యటనకు భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ ఆదేశాలు ఇచ్చింది.
Gold: గత వారం రోజులుగా తగ్గిన బంగారం ధరలు.. ఈ వారం పరిస్థితి ఎలా ఉండనుంది?
బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా లగచర్లను సోమవారం సందర్శించనున్నారు. మొదట సంగారెడ్డి జైలులో ఉన్న బాధిత రైతులను పరామర్శించిన అనంతరం లగచర్లకు చేరుకుని గ్రామస్థులపై జరిగిన ఘటనలపై వివరాలు సేకరించనున్నారు. వికారాబాద్ జిల్లా లగచర్ల, రోటిబండతండాలకు చెందిన గిరిజనులు, ఫార్మా కంపెనీ కోసం భూములను బలవంతంగా సేకరిస్తున్నట్లు ఫిర్యాదు చేయడానికి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలవడానికి ఢిల్లీకి వెళ్లారు. గతంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన వీరితో పాటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఇతర బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు. లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో శనివారం రాత్రి అదనంగా అరెస్టయిన నలుగురు నిందితులను కొడంగల్ పోలీస్ స్టేషన్‌లో విచారించి, అనంతరం రాత్రి న్యాయమూర్తి శ్రీరామ్ ఎదుట హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో నిందితులను సంగారెడ్డి జైలుకు తరలించారు.
ఫార్మా విలేజీ కోసం వికారాబాద్ జిల్లాలోని దుద్యాల్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. తాము భూములు ఇవ్వబోమంటూ అక్కడి గిరిజన రైతులు కొంతకాలం నుంచి ఆందోళన చేస్తున్నారు. అయితే.. ఈ క్రమంలోనే.. ఇటీవల భూసేకరణ అంశంపై గ్రామసభ నిర్వహించేందుకు అధికారులు వెళ్లారు. దీంతో స్థానికులు తీవ్ర అధికారులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొందరు కలెక్టర్, అధికారులపై దాడికి చేశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు.. కేసులు నమోదు చేసి, పలువురిని అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలింపు జరుపుతున్నారు. అయితే పోలీసులు తమ పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని గిరిజన కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.
Masked Burglars : బ్రిటన్ రాజ భవనంలోకి ముసుగు దొంగలు.. ఏమేం ఎత్తుకెళ్లారంటే..