Site icon HashtagU Telugu

La Bonnotte: ఏంటి.. ఒక కిలో బంగాళదుంపలు రూ.50 వేలా.. వాటి ప్రత్యేకత ఏమిటో తెలుసా?

La Bonnotte

La Bonnotte

సాధారణంగా సోషల్ మీడియాలో నిత్యం కొన్ని వందలాది వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని వార్తలు విని ఆశ్చర్యపోవడంతో పాటు షాక్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే వార్త కూడా అటువంటిదే. సాధారణంగా మనకు మార్కెట్ లో కిలో బంగాళాదుంపల ధర ఎంత అంటే కేజీ రూ.30 నుంచి రూ.50 మధ్య లేదా ఒక్కొక్కసారి రూ. 80 నుంచి రూ.100 వరకు కూడా రేటు పలుకుతూ ఉంటుంది. సీజన్‌ని బట్టీ, దిగుబడిని బట్టీ.. ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే బంగాళదుంపలు కేజీ అక్షరాల రూ.50వేలు. ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. మరి ఆ బంగారం దుంపల ప్రత్యేకత ఏమిటి? వాటిని ఎక్కడ పండిస్తారు? ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ దుంపలను ఫ్రాన్స్‌లో లా బొన్నొట్టే అంటారు. వీటిని ఇండియాలో సాగు చెయ్యడం లేదు. ఫ్రాన్స్‌లో కూడా ఇలే డీ నాయిర్మౌషియర్ అనే ఒక దీవిలో మాత్రమే ఈ దుంపలను సాగుచేస్తారు. ఆ దీవిలో ఓరకమైన ఇసుక నేల ఉంటుంది. ఆ నేలలో వాటిని సాగు చేస్తున్నారు అక్కడి ప్రజలు. అయితే ఈ దుంపల పండించడం కోసం వారు కోసం ఎరువులు, పురుగుమందులు లాంటివి ఉపయోగించడం. కేవలం సముద్రంలో లభించే ఓ రకమైన గడ్డి ని ఎరువుగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా వాటిని కేవలం 50 చదరపు మీటర్ల ప్రదేశంలో మాత్రమే సాగు చేస్తున్నారట. అంతేకాకుండా ఆ దుంపలకు మరొక ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే ఆ దుంపలు సంవత్సరం అంతా లభించవు.

కేవలం ఏడాదిలో పది రోజులు మాత్రమే లభిస్తాయి. వాటి సాగును ప్రారంభించిన తర్వాత మూడు నెలలకు పంట చేతికి అందుతుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో పంట సాగు చేయడం ప్రారంభించగా మీలో దిగుబడి వస్తుంది. చేతులతో వీటిని ఇసుక నుంచి బయటకు తీస్తారు. అయితే దుంపలు కాస్త ఉప్పుగా ఉంటాయి. కానీ అవి కొన్ని రకాల వ్యాధులను నయం చేయడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇటువంటి ప్రత్యేకలు ఉండటం వల్ల ఆ దుంపల కేజీ ధర 500 యూరోలు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.43వేలు. ఒక్కోసారి వీటి ధర రూ.50వేల దాకా పలుకుతుంది. ఈ దుంపలు ప్రపంచంలో ఐదు అత్యంత ఖరీదైన కూరగాయలలో ఒకటిగా పేరు తెచ్చుకున్నాయి. ఆ దుంపలను సలాడ్లు, సూప్‌లు, క్రీమ్స్, ప్యూరీల్లో ఉపయోగిస్తున్నారు. అలాగే మందుల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. కాగా ఈ దుంపలను ఆన్‌లైన్‌ ఈ కామర్స్ సైట్లలో కొనుగోలు చేయవచ్చు. వాటిలో ఆ దుంపలు ధర రూ.50వేలకు పైగానే ఉంది.