రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్నది. దీంతో ఉక్రెయిన్‌లో ఎటు చూసీనా భీభత్సమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏ క్షణంలో ఎటు నుంచి బాంబులు వచ్చిపడతాయో, ఎటు నుంచి తూటాలు దూసుకొస్తాయో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. రష్యా నుంచి పెద్ద సంఖ్యలో ట్యాంకర్లు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని కీవ్‌తో పాటు, రెండో పెద్ద నగరమైన ఖార్కివ్‌లో జనావాసాలే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోంది.
ఈ క్రమంలో ఖార్కివ్‌లోని ఆస్పత్రులను టార్గెట్ చేసింది రష్యా సైన్యం. ఉక్రెయిన్ సైనికులు అక్కడ ఉన్నారనే సమాచారంతో రాకెట్ లాంచర్లతో దాడి చేస్తోంది. ఈ దాడుల్లో అమాయక పౌరులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ప్రాణభయంతో లక్షలాది మంది దేశాన్ని వీడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కీవ్‌లో టీవీ టవర్‌ను రష్యా సైనిక బలగాలు పేల్చేశాయి. దీంతో ఉక్రెయిన్‌లో టీవీ ప్రసారాలు ఆగిపోయాయి. వార్తలు చూసే పరిస్థితి లేక బయట ఏం జరుగుతోందో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కీవ్‌లో టీవీ టవర్‌ను రష్యా క్షిపణి కూల్చివేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Video of the Kyiv TV tower being attacked by Russian forces moments ago. Clearly now moving to take out communications in the capital. pic.twitter.com/QFOodt5Kgj
— Christopher Miller (@ChristopherJM) March 1, 2022
