Site icon HashtagU Telugu

CM Jagan: మరో ఐదు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుంది: CM జగన్

CM Jagan

Jagan Proddutur

CM Jagan: నాయుడుపేట సభలో ముఖ్యమంత్రి జగన్ మోహ‌న్ రెడ్డి (CM Jagan) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నాయుడుపేట జన సముద్రాన్ని తలపిస్తోందని అన్నారు. ఇంటింటికి అందుతున్న సంక్షేమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మరో ఐదు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల‌ను, ఎంపీల‌ను ఎన్నుకునేందుకు జ‌రుగుతున్న ఎన్నికలు కావు ఇవి, అందరి భవిష్యత్తును నిర్ణయించేవి ఈ ఎన్నికలేన‌ని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో కుటుంబంలోని ప్రతి ఒక్కరి భవిష్యత్తును నిర్ణయించేవి ఈ ఎన్నికలేని చెప్పుకొచ్చారు.

జగన్ ఓడించేందుకు కూట‌మి నాయ‌కులు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికలు రెండు భావజాలాల మధ్య జరుగుతున్నాయని, ఒక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం వద్దన్నవారికి, ఇంగ్లీష్ మీడియంతో పాటు నాడు..నే డు ద్వారా పాఠశాలల రూప రేఖలు మార్చిన మనకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే సమతుల్యం దెబ్బతింటుందని కోర్టును ఆశ్రయించారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ..మైనార్టీలకు కేటాయించామ‌న్నారు. ఎక్కడా వివక్ష ..లంచాలు లేకుండా లబ్దిని అర్హులకు అందించామ‌ని తెలిపారు. పెన్షన్లను ఇంటికే వచ్చి ఇచ్చామని స్ఫ‌ష్టం చేశారు. ఇప్పుడు యుద్ధం ఏ స్థాయిలో జరుగుతోందో చూస్తున్నాం క‌దా అని ప్ర‌శ్నించారు. ప్రతి నెల ఒక‌టో తేదీన వాలంటీర్లు నేరుగా ఇంటికి వచ్చి అవ్వా తాతలకు పెన్షన్లను 58 నెలలగా ఇచ్చార‌ని తెలిపారు.

ఎన్నికలు రావడంతో జీర్ణించుకోలేక అసూయతో చంద్రబాబు తనకు సంబంధించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. 2019 ఎన్నికలకు ముందు 1000 రూపాయలుగా ఉన్న పెన్షన్ ను రూ.3 వేలకు పెంచామ‌ని తెలిపారు. అందరూ ఆలోచన చేయాలని సీఎం జ‌గ‌న్ కోరారు. రాజకీయాలు నిజంగా దిగజారిపోయాయి.. చెడిపోయాయని తెలిపారు. అవ్వా.. తాతలకు ఇంటి వద్దనే ఇచ్చే పెన్షన్ ను ఆపించారని విమ‌ర్శ‌లు చేశారు. ఇలాంటి దుర్మార్గం వల్లే 31 మంది అవ్వ తాతలు నడ‌వ‌లేక అవస్థలు పడలేక ప్రాణాలు విడిచారన్నారు. రెండు రోజుల్లోనే ఇంతమంది మరణించడం బాధాకరమ‌ని అన్నారు. 31 మంది మరణానికి కారణమైన చంద్రబాబును హాంతకుడని అందామా..? అని ప్ర‌జ‌ల‌ను అడిగారు.

Also Read: Jeans Effects : టైట్ జీన్స్ వేసుకుంటున్నారా ? ఈ ప్రమాదం తప్పదు..

రెండు నెలలు ఓపిక పట్టండి. జూన్ 4న మళ్లీ అధికారంలోకి వస్తామ‌ని తెలిపారు. మళ్లీ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి ఇంటింటికి సేవలు అందించే కార్యక్రమం పైన మొదటి సంతకం చేస్తా అని ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. చంద్రబాబు హయంలో జన్మభూమి కమిటీలు ఏ విధంగా పని చేశాయో అందరు చూశారు క‌దా అని ప్ర‌శ్నించారు. మనం పెట్టిన వాలంటరీ వ్యవస్థ ఏ విధంగా పనిచేసిందో చూశారు క‌దా అని తెలిపారు. ఇది చూసి చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని ఆరోపించారు. జగన్ మామ అని చిన్నారులు ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటారని సీఎం గుర్తుచేశారు. మీ భవిష్యత్ మార్చేందుకే 58 నెలలు కష్టపడ్డానని పేర్కొన్నారు.

చంద్రబాబు 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేశారు. మరి ఆయన చేసిన ఒక మంచి పనైనా గుర్తుకు వస్తుందా..? అని ప్ర‌శ్నించారు. ఆయన మార్క్ పథకం ఏదీ లేదన్నారు. ఆయన పేరు చెబితే గుర్తుకు వచ్చేది వెన్ను పోట్లు.. అబద్ధాలు.. కుట్రలు కుతంత్రాలు అని తెలిపారు. 58 నెలల్లో మనం మంచి సమాజాన్ని నిర్మించామ‌ని చెప్పారు. 2024 ఎన్నికల్లో కూడా అబద్ధాలు చెప్పను.. మోసాలు చేయమ‌ని ప్ర‌జ‌ల‌కు తెలిపారు. అమలు చేయలేని హామీలను మేనిఫెస్టోలో పెట్టనని తెలిపారు. జగన్ అమలు చేయలేని ఏ స్కీము కూడా చంద్రబాబు కాదు.. ఎవరూ అమలు చేయలేరని తెలిపారు.

We’re now on WhatsApp : Click to Join