Site icon HashtagU Telugu

Kumaraswamy: కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి అస్వస్థత

Kumaraswamy

Whatsapp Image 2023 04 23 At 10.57.26 Am

Kumaraswamy: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి స్వల్ప అస్వస్థకు గురయ్యారు. దీంతో శనివారం రాత్రి బెంగుళూరులోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరారు. జ్వరం, అలసట కారణంగానే కుమారస్వామి నీరసించారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుమారస్వామి తెలిపారు. విశ్రాంతి తీసుకుని మళ్ళీ ప్రచారంలోకి వస్తానని ఆయన తెలిపారు.

ప్రస్తుతం దేశంలో కర్ణాటక ఎన్నికల హడావుడి పతాక స్థాయికి చేరుకుంది. ఈ సందర్భంగా నేతలు గెలుపే లక్ష్యంగా క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు. విపక్షాలను ఎండగట్టడంతో పాటు తమ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లుతున్నారు. ఇక కొద్దీ రోజులుగా కుమారస్వామి ఎన్నికల ప్రచారంలో బిజీగా తిరుగుతున్నారు. విశ్రాంతి లేకపోవడం, మరోవైపు ఎండలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆయన కొంత అనారోగ్యానికి గురయ్యారు.

నిజానికి కొంతకాలంగా కుమారస్వామి అలసటగానే ఉన్నారు. డాక్టర్లు పలుమార్లు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారట. అయితే ఎన్నికల హడావిడిలో విస్తృతంగా ప్రచారం సాగించడం ద్వారా కుమారస్వామి తన ఆరోగ్యాన్ని పక్కనపెట్టేసి ప్రజల్లోకి వెళ్లారు. నిన్న శనివారం స్వల్ప అస్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు బెంగుళూరు లోని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read More: Earthquakes: ఇండోనేషియాను కుదిపేసిన భూకంపాలు.. గంటల వ్యవధిలోనే రెండు భూకంపాలు..!