KTR’s Son: మరో టాలెంట్ కు సిద్ధమవుతున్న కేటీఆర్ కుమారుడు హిమాన్షు

మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు.. తాత, నాన్న అడుగుజాడల్లో నడుస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలి అని నిరూపించుకుంటున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Himanshu

Himanshu

KTR’s Son: తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు.. తాత, నాన్న అడుగుజాడల్లో నడుస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలి అని నిరూపించుకుంటున్నాడు. పాఠశాల స్థాయిలోనే చెప్పుకోదగ్గ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాడు. హిమాన్సు ఇప్పుడు మరో ప్రతిభను బయటపెట్టబోతున్నాడు. తన మధురమైన గాత్రంతో అందరినీ అలరించడానికి సిద్ధమవుతున్నాడు.

ఇటీవల హిమాన్షు ‘గోల్డెన్ అవర్’ X హిమాన్షు అనే కవర్ సాంగ్‌తో శ్రోతలను ఆశ్చర్యపరిచాడు. యువ కళాకారుడిగా తనదైన ముద్ర వేశాడు. తండ్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా హిమాన్షు ఓ పాటను విడుదల చేయాలని భావించాడు. కానీ టెక్నికల్ అంశాల వల్ల సాధ్యపడలేదు. త్వరలోనే ఈ పాట విడుదలయ్యే అవకాశం ఉంది. ఈసారి హిమాన్షు ఏమాయ చేస్తాడోనని బీఆర్ఎస్ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతని తండ్రి, మంత్రి కేటీఆర్ తొలిపాట కోసం వెయిట్ చేస్తున్నా అంటూ రియాక్ట్ అయ్యాడు.

Also Read: Pawan Kalyan Tweet: వైసీపీ పాలనలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయి: పవన్ కళ్యాణ్

  Last Updated: 24 Jul 2023, 05:02 PM IST