Site icon HashtagU Telugu

KTR: బీఆర్ఎస్ కార్యకర్త ఇంట్లో కేటీఆర్ భోజనం.. ఫొటోలు వైరల్

Ktr

Ktr

KTR: ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీమంత్రి కేటీఆర్ తెలంగాణ అంతటా సుడిగాలి పర్యటన చేశారు. శనివారం పెద్దపల్లి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కి మద్దతుగా, చెన్నూరు మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన హాజరయ్యారు. అనంతరం దళిత సోదరులు, బీఆర్ఎస్ కార్యకర్త ఎనగందుల ప్రశాంత్  ఇంట్లో కేటీఆర్  కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్ భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

కాగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని యూసుఫ్ గూడ, ముషీరాబాద్ లో మైనార్టీలతో జరిగిన మీటింగ్ లో పాల్గొని ప్రసంగించారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత పదేళ్లలో కేసీఆర్  మైనార్టీల కోసం ఎన్ని పనులు చేశారో గుర్తు చేసువాలన్నారు. ఉత్తర ప్రదేశ్ లో 4 కోట్ల ముస్లింలు ఉంటే 1600 కోట్లు మాత్రమే ముస్లింలకు కోసం బడ్జెట్ పెట్టిందని, బెంగాల్ దాదాపు రెండు కోట్లకు పైగా ముస్లింలు ఉంటే అక్కడ 2 వేల కోట్లు బడ్జెట్ పెట్టారని, మహారాష్ట్రలో కోటిన్నర ముస్లింలు ఉంటే 670 కోట్లు, కర్ణాటకలో 80 లక్షల ముస్లింలు ఉంటే 2 వేల కోట్లు మాత్రమే అని, అదే తెలంగాణలో మాత్రం 50 లక్షల ముస్లింలు ఉంటే 2 వేల 2 వందల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిందని కేటీఆర్ అన్నారు.