KTR: రజనీ వ్యాఖ్యలపై కేటీఆర్ కామెంట్స్.. విపక్షాలపై సెటైర్లు

తాజాగా మంత్రి కేటీఆర్ (KTR) మరోసారి రజినీ వ్యాఖ్యలను గుర్తు చేశారు.

Published By: HashtagU Telugu Desk
Ktr, Basara

Ktr

తాజాగా మంత్రి కేటీఆర్ (KTR) మరోసారి రజినీ వ్యాఖ్యలను గుర్తు చేశారు. తమిళనాడు సూపర్ స్టార్ రజినీ కాంత్ (Rajinikanth) హైదరాబాద్ గురించి గొప్పగా చెప్పారని, వారికి కూడా ఇక్కడి అభివృద్ధి కనపడుతోందని, కానీ స్థానికంగా ఉండే కొంతమందికి అర్థం కావడంలేదని విపక్షాలపై సెటైర్లు వేశారు.

రజినీకాంత్ తోపాటు, సినీ నటి లయ కూడా హైదరాబాద్ (Hyderabad) ని చూస్తే విదేశాల్లో ఉన్నట్టుగా ఉందని చెప్పారని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని, దానికి రజినీకాంత్, లయ వంటి వారి వ్యాఖ్యలే నిదర్శనం అన్నారు కేటీఆర్. రజినీ కాంత్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందన వైరల్ గా మారింది.

Also Read: Voting Begins : కర్ణాటకలో పోలింగ్ షురూ

 

  Last Updated: 10 May 2023, 11:09 AM IST