KTR: ఈ నెల 6న వరంగల్ కు కేటీఆర్ రాక, భారీగా సంక్షేమ బహిరంగ సభ!

అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి కట్టుగా సంన్వయం తో కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.

  • Written By:
  • Publish Date - October 2, 2023 / 11:10 AM IST

KTR: హనుమకొండ, వరంగల్ జిల్లాలో రాష్ట్ర ఐటి, పురపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టి విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ నెల 6న వరంగల్ కు కేటీఆర్ రాక సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అదే రోజు వరంగల్ లో భారీగా సంక్షేమ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ సభలో వేలాది మంది లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను కేటీఆర్ చేతుల మీదుగా పంపిణీ చేస్తారు. ఇందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి కట్టుగా సంన్వయం తో కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. హనుమకొండ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్షించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మేల్యేలు, అధికారులుతో సన్నాహక, సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల ఆరవ తేదీన మంత్రి కేటీ ఆర్ హైదరాబాద్ నుండి నేరుగా చాఫర్ లో kmc కి చేరుకుంటారు అని అన్నారు. అనంతరం mgm సమీపంలో పోలీస్ భరోసా కేంద్ర ప్రారంభోత్సవం తో జిల్లా పర్యటన ప్రారంభం కానున్నదని ఆయన అన్నారు. స్మార్ట్ సిటీ పనులు, డిజిటల్ లైబ్రరీ, ITటవర్స్, ఆరు జంక్షన్ ప్రారంభోత్సవాలు,వివిధ రకాల శంకుస్థాపనల ప్రదేశాల్లో అన్ని సిద్ధం చేయాలని, అధికారులు తమకు కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆయన తెలిపారు. రూట్ మ్యాప్ పై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 58, 59, 76 మొదలగు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, లబ్ధిదారులకు సీటింగ్ అరేంజ్మెంట్ ప్రత్యేకంగా చేయాలని అయన సూచించారు.

మంత్రి పర్యటన నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. అధికారులు వారి వారి శాఖల పరిధిలో చేపట్టే పనులు సజావుగా జరిగే విధంగా పర్యవేక్షించాలని ఆయన తెలిపారు. మంత్రి పర్యటన నేపథ్యంలో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.