KTR Open Letter:బండిసంజయ్ కి బహిరంగ లేఖ రాసిన కేటీఆర్

తెలంగాణలో ఎదో ఒక అంశంపై రెండుపార్టీల మధ్య వర్డ్స్ వార్ కొనసాగుతోంది. ఇప్పటికే వరిధాన్యం విషయంలో మాటలయుద్ధం నడిపిస్తున్న బీజేపీ టీఆర్ఎస్ తాజాగా మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై మంత్రి కేటీఆర్ విరుచుకుప‌డ్డారు.

తెలంగాణలో ఎదో ఒక అంశంపై రెండుపార్టీల మధ్య వర్డ్స్ వార్ కొనసాగుతోంది. ఇప్పటికే వరిధాన్యం విషయంలో మాటలయుద్ధం నడిపిస్తున్న బీజేపీ టీఆర్ఎస్ తాజాగా మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై మంత్రి కేటీఆర్ విరుచుకుప‌డ్డారు. ఈ నెల 27న బీజేపీ నేతలు ఇందిరా పార్కు వద్ద త‌ల‌పెట్టిన నిరుద్యోగ దీక్ష‌పై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. క‌మ‌లం నేత‌ల దీక్ష‌ల‌ను, క‌పట ప్రేను చూసి అవ‌కాశ‌వాద‌మే సిగ్గుతో ఆత్మ‌హ‌త్య చేసుకుంటుంద‌ని కేటీఆర్ విమ‌ర్శించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన తర్వాత త‌మ ప్ర‌భుత్వం ల‌క్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిందని, కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌ బీజేపీ ఎన్నికోట్ల ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలంటూ బండి సంజయ్‌కు కేటీఆర్ బ‌హిరంగ లేఖ రాశారు.

దేశంలో యువ‌త‌ను న‌మ్మించి న‌ట్టేట ముంచిన చ‌రిత్ర బీజేపీదేన‌ని, బీజేపీ చేత గాని పాల‌న‌తో నిరుద్యోగిత రేటు గ‌త 40 సంవ‌త్స‌రాల‌లో ఎన్న‌డూ లేనంత పెరిగింద‌ని కేటీఆర్ విమర్శించారు.

తెలంగాణ‌లో టీఎస్ ఐపాస్ విధానంతో రాష్ట్రానికి 2లక్ష‌ల20 వేల కోట్ల పెట్ట‌బుడులు తీసుకువ‌చ్చామ‌ని కేటీఆర్ తెలిపారు. దీనిద్వారా సుమారు 16 ల‌క్ష‌ల‌కు పైగా కొత్త ఉద్యోగాలు క‌ల్పించామ‌ని, యువ‌త‌కు ఉపాధి క‌ల్పించ‌డంలో తాము చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తున్నామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

నిరుద్యోగ యువ‌త‌పై బండికి సంజ‌య్‌కి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇందిరా పార్కు వద్ద కాకుండా ఢిల్లీలోని జంత‌ర్ మంతర్‌ వద్ద‌ దీక్ష చేయాల‌ని స‌వాల్ విసిరారు. సిగ్గుమాలిన దీక్ష చేస్తూ యువ‌త‌ను మోసం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ల‌క్ష‌లాది ఉద్యోగాలు ఇస్తామ‌ని చెప్పి పెండింగ్‌లో పెట్టిన కేంద్ర ప్ర‌భుత్వాన్ని గ‌ల్లాప‌ట్టుకుని నిల‌దీసే ద‌మ్ముందా అని కేటీఆర్ బండి సంజ‌య్‌ని ప్ర‌శ్నించారు. కేంద్రం ప‌రిధిలో ఉన్న మొత్తం 15లక్షల ఖాళీలను ఇంకా ఎందుకు భర్తీ చేయలేదో ప్రధాని మోదీని నిల‌దీయాల‌న్నారు. ఉద్యోగ నోటిఫికేష‌న్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు.

తెలంగాణపై కేంద్రం క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంద‌ని, పారిశ్రామిక ప్రగతి కోసం ఒక్క ప్రోత్సాహం కూడా ఇవ్వలేదని, రాష్ట్రానికి పెట్టుడులు త‌ర‌లివ‌స్తుంటే పారిశ్రామిక కారిడార్లు ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తులు చేస్తున్నా కేంద్రం కావాల‌ని కొర్రీలు పెట్టిందని,హామీ ఇచ్చిన బ‌య్యారం ఉక్కు ప్యాక్ట‌రీ, ఐటీఐఆర్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించలేని, చేతకానితనంపై ఇందిరాపార్కు సాక్షిగా ముక్కునేలకు రాసి ప్రజలకు వివరణ ఇవ్వాల‌న్నారు కేటీఆర్ కోరారు.

రాజ‌కీయ ల‌బ్దికోస‌మే ఇంధిరాపార్కులో బండి సంజ‌య్ దీక్ష చేస్తున్నార‌ని, నిరుద్యోగుల‌పై క‌ప‌ట ప్రేమ‌ను కురిపిస్తూ రాజ‌కీయ నిరుద్యోగంతో దీక్షకు దిగుతున్న బీజేపీ నేత‌లు అత్మవంచన చేసుకోకుండా ఆత్మపరిశీలన చేసుకోసుకోవాల‌ని కేటీఆర్ కోరారు. రాష్ట్ర యువతకు, నిరుద్యోగులకు ఏ సాయమూ చేయలేని మీ చేతగానితనానికి, నిస్సహాయతకు క్షమాపణ చెప్పాల‌ని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అని జనం మిమ్మల్ని చూసి నవ్వుకుంటారనంటూ ఎద్దేవా చేశారు.

ప్ర‌తిపక్షాల చేసే క‌ప‌ట‌పు ఉచ్చులో తెలంగాణ యువ‌త ప‌డొద్ద‌ని, యువత అకాంక్షలకు అనుగుణ‌గా త‌మ ప్ర‌భుత్వం న‌డుస్తోంద‌ని కేటీఆర్ తెలిపారు. నిరుద్యోగుల‌కు ఉపాధి క‌ల్పించ‌డంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తోంద‌ని, ఇప్ప‌టికే ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగాల్లో ల‌క్ష‌లాది మందికి ఉద్యోగ క‌ల్పన జ‌రిగిందని, మున్ముందు కూడా త‌మ ప్ర‌య‌త్నం య‌థావిధిగా కొన‌సాగుతుంద‌ని యువ‌త‌కు తెలిపారు. రాజ‌కీయ ల‌బ్ధి కోసం ప్ర‌తిప‌క్ష నేత‌లు చేసే అస‌త్యాల‌ను న‌మ్మొద్ద‌ని, యువత విజ్ఞ‌త‌తో అలోచించాల‌ని కేటీఆర్ కోరారు.