Site icon HashtagU Telugu

KTR: బాలుడి చికిత్సకు అండగా నిలిచిన కేటీఆర్, ఇంటికి వెళ్లి ఆర్థికసాయం అందజేత

Telangana

Telangana

KTR: ఘట్‌కేసర్ మండలం మైసమ్మ గుట్ట బస్తీకి చెందిన కే. శేషు కుమారుడు ప్రదీప్ మూగ, చెవుడు సమస్యతో బాధపడుతున్నాడు. పుట్టుకతోనే ఈ సమస్య ఉన్న ప్రదీప్ చికిత్స కోసం బాలుని తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. తమ బిడ్డకు ఉన్న సమస్య పరిష్కారం కోసం అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఆర్దిక కష్టాలపాలైనా ఇందుకు సంబంధించిన ఆపరేషన్ కూడా ఆ తల్లిదండ్రులు చేయించారు.. కానీ దురదృష్టవశాత్తు ఆపరేషన్ సక్సెస్ కాకపోవడంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది.

మరోసారి చికిత్స కోసం ఆస్పత్రిలో సంప్రదిస్తే ఆపరేషన్ కోసం ఏడు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో ప్రదీప్ కుటుంబం అవేదనకు గురయ్యింది. ఈ విషయం తెలుసుకున్న అప్పటి మంత్రి మల్లారెడ్డి చొరవ తీసుకుని అపరేషన్ కు అవసరం అయిన 6 లక్షల సహాయాన్ని ఈఎస్ఐ ద్వారా సాయం చేశారు. అయితే రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబానికి మిగిలిన లక్ష రూపాయలు కూడా జమ చేయడం కష్టంగా మారింది. సమస్యను తెలుసుకున్న బీఆర్ఎస్ స్థానిక కౌన్సిలర్ ఆంజనేయులు విషయాన్ని కేటిఆర్, మాజీ మంత్రి మల్లారెడ్డి దృష్టికి తెచ్చారు.

దీంతో నేడు మేడ్చల్ నియోజకవర్గం కృతజ్ఞతా సభలో పాల్గొన్న కేటీఆర్ సభ ముగిసిన తరువాత మల్లారెడ్డితో కలిసి ఘట్‌కేసర్ మండలం మైసమ్మ గుట్ట బస్తీలోని ప్రదీప్ ఇంటికి వెళ్లి బాలుడిని పరామర్శించారు. తాను అండగా ఉంటానని ఆ కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును అందజేశారు. తమ కుమారుడి ఆపరేషన్ కు సాయం చేసిన కేటీఆర్, మల్లారెడ్డి గారికి ఎప్పుడూ ఋణపడి ఉంటామని ప్రదీప్ కుటుంబ సభ్యులు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు.

Exit mobile version