Shilpa Layout Flyover : నేడు శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించ‌నున్న మంత్రి కేటీఆర్

శిల్పా లేఅవుట్ ఫ్లైఓవ‌ర్ ను మంత్రి కేటీఆర్ నేడు (శుక్ర‌వారం) ప్రారంభించనున్నారు. గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్‌లో...

  • Written By:
  • Publish Date - November 25, 2022 / 11:27 AM IST

శిల్పా లేఅవుట్ ఫ్లైఓవ‌ర్ ను మంత్రి కేటీఆర్ నేడు (శుక్ర‌వారం) ప్రారంభించనున్నారు. గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్‌లో సాయంత్రం 4:15 గంటలకు ప్రారంభోత్సవం జరగనుంది. గత 6 సంవత్సరాల్లో జీహెచ్ఎంసీ ద్వారా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద పూర్తి చేసిన 17వ ప్రాజెక్ట్ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ ట్రాఫిక్‌ను సులభతరం చేయడమే కాకుండా హైటెక్ సిటీ, హెచ్‌కెసి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ఈ ఫ్లైఓవర్ హైదరాబాద్‌లోని వివిధ ముఖ్యమైన ప్రాంతాలకు, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి నేరుగా కనెక్టివిటీని ఏర్పాటు చేస్తుంది.ఇది 823 మీటర్ల పొడవు, 16.6 మీటర్ల వెడల్పు, నాలుగు-లేన్ బై-డైరెక్షనల్ ఫ్లైఓవర్. ఇది శిల్పా లేఅవుట్ నుండి గచ్చిబౌలి జంక్షన్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ (ORR) వరకు ప్రయాణించే ప్రయాణికులకు వారి ప్రయాణ సమయాన్ని త‌గ్గిస్తుంది.