Site icon HashtagU Telugu

Textile GST: కేంద్ర విధానాలపై కేటీఆర్ ఫైర్!

Ktr

Ktr

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శులు చేశారు. కేంద్రం విధానాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని కేటీఆర్ తెలిపారు.

వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు, జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం తీరుపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్రానికి పలు ప్రశ్నలు వేశారు.

మేకిన్‌ ఇండియా అంటూ రోజూ ఉపన్యాసాలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం స్వదేశంలో వస్త్ర తయారీ పరిశ్రమకు సహకారం అందించాల్సింది పోయి,
జీఎస్టీని 5 నుంచి 12శాతానికి పెంచడమేంటని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వస్త్ర పరిశ్రమకు మరణశాసనంగా మారుతుందని కేటీఆర్ తెలిపారు.

జాతీయ చేనేత దినోత్సవం రోజు చేనేతకు చేయూతనిస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ నేతన్నలను కాపాడి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కేటీఆర్ సవాలు విసిరారు.

బీజేపీ ప్రభుత్వం అన్ని విషయాల్లో డబుల్ స్టాండ్ ఉంటుందని, తాజాగా నియోజకవర్గాల పునర్విభజన విషయంలోనూ కేంద్రం ఇదే వైఖరిని అవలంబిస్తోందంటూ కేటీఆర్‌ మండిపడ్డారు. జమ్మూకశ్మీర్‌కు ఒక నిబంధన దక్షిణాదికి మరో నిబంధనా అని ప్రశ్నించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్నవారు ప్రజల్ని వేరుగా చూడటం విడ్డూరంగా ఉందని, మొన్న జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఆతర్వాత అనేక రకాల నిధుల కేటాయింపు విషయాల్లో, నిన్న వరిధాన్యం విషయంలో తాజాగా నియోజకవర్గాల పునర్విభజన విషయంలో ఇలా అన్ని విషయాల్లో కేంద్రం రాష్ట్రాల మధ్య వివక్షత చూపుతుందని కేటీఆర్ తెలిపారు.

Exit mobile version