Jeevan Reddy: కేటీఆర్ ఆ స్థానం నుంచి పోటీ చేయాలి, జీవన్ రెడ్డి డిమాండ్

జగిత్యాల లోని ఇందిరా భవన్ లో శుక్రవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వాస్తవాలు తెలుసుకో, కేటీఆర్ మాట్లాడే తీరుతో బీఆర్ఎస్ గెలుస్తుందన్న ఒక్క మెదక్ ఎంపీ సీటుకుడా గెలిచే అవకాశం ఉండదన్నారు. రెండు టీఎంసీ లు ఉపయోగించకుండా మరో అదనపు టీ ఎం సీ కోసం అనుమతులు లేకుండా చేపట్టడం నేరమని అన్నారు. తుమ్మడి హెట్టీ వద్ద 160 టీఎంసీ ల నీరు లభ్యత ఉందని నివేదిక ఉండగా తుమ్మడి […]

Published By: HashtagU Telugu Desk
MLC Elections

MLC Elections

జగిత్యాల లోని ఇందిరా భవన్ లో శుక్రవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వాస్తవాలు తెలుసుకో, కేటీఆర్ మాట్లాడే తీరుతో బీఆర్ఎస్ గెలుస్తుందన్న ఒక్క మెదక్ ఎంపీ సీటుకుడా గెలిచే అవకాశం ఉండదన్నారు. రెండు టీఎంసీ లు ఉపయోగించకుండా మరో అదనపు టీ ఎం సీ కోసం అనుమతులు లేకుండా చేపట్టడం నేరమని అన్నారు. తుమ్మడి హెట్టీ వద్ద 160 టీఎంసీ ల నీరు లభ్యత ఉందని నివేదిక ఉండగా తుమ్మడి హేట్టి నుండి కిందికి దించటానికి మరో నివేదిక సైతం ఇచ్చారని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజినామ చేసి మల్కాజిగిరి నుండి ఎంపీగా పోటీ చేయాలని కేటీఆర్ సవాలు చేయడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే, సీఎం పదవి ఒక్కటేనా అని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. కేటీఆర్ సవాలు విసరడం పై నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం కరీంనగర్ పరిధిలోఉంది కధ దమ్ముంటే కరీంనగర్ లేదా, నిజామాబాద్ నుండి ఎంపీగా పోటీచేయాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు.

  Last Updated: 02 Mar 2024, 12:37 AM IST