Site icon HashtagU Telugu

KTR tweets : కాంగ్రెస్ డిక్లరేషన్ సభ ఫై మంత్రి కేటీఆర్ సెటైర్లు

Ktr Tweets

కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల‌లో నిర్వ‌హించిన ఎస్సీ, ఎస్టీ డిక్ల‌రేష‌న్ స‌భ‌ (Congress Public Meeting) పై బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ (KTR) సెటైర్లు వేశారు. అది డిక్ల‌రేష‌న్ స‌భ (Congress Party SC,ST Declaration) కాద‌ని, ఫ్రస్ట్రేషన్ సభ అని అన్నారు. ప్ర‌స్తుతం అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కేటీఆర్.. ట్విట్టర్ లో కాంగ్రెస్ సభ ఫై కామెంట్స్ చేసారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట విజన్ లేని కాంగ్రెస్ (Congress) ఇచ్చిన డజను హామీలు గాల్లో దీపాలేన‌నే విష‌యం చైత‌న్యానికి ప్ర‌తీక అయిన తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు.

ఎస్సీ, ఎస్టీలకు డిక్లరేషన్‌ (Congress Party SC,ST Declaration) పేరుతో 12 హామీలు కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల సభ వేదికగా ప్రకటించింది. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తే.. దళిత, గిరిజనులకు న్యాయం జరుగుతుందని… పదో తరగతి నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసిన విద్యార్థులు నగదు ప్రోత్సాహం ఇస్తామని.. దళిత, గిరిజనులకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్యాయం చేసిందని… కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే వారికి న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ కామెంట్స్ ఫై బీఆర్‌ఎస్‌ నేతలు కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు.

Read Also : Heart Attack : ఫ్లైట్‌లో రెండేళ్ల చిన్నారికి గుండెపోటు..బతికించిన ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు

ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ (Minister KTR) కాంగ్రెస్ పార్టీ ఫై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసారు. ‘‘అది డిక్లరేషన్ సభ కాదు…అధికారం రానే రాదనే… కాంగ్రెస్ ఫస్ట్రేషన్ సభ. కర్ణాటకలో కనీసం రేషన్.. ఇవ్వలేని కాంగ్రెస్. తెలంగాణకొచ్చి డిక్లరేషన్.. ఇస్తే నమ్మేదెవరు ?. గాడ్సేనే గెలుస్తాడన్న గ్యారెంటీ లేదు. మీ 12 గ్యారెంటీలకు విలువ ఎక్కడిది. చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ ప్రజలకు తెలుసు.. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట.. విజన్ లేని కాంగ్రెస్.. డజన్ హామీలు.. గాలీలో దీపాలే.

స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా ఎస్సీలు, ఎస్టీలు వెనకబడి ఉన్నారంటే దానికి కారణం, ప్రధాన దోషి కాంగ్రెస్ పార్టీ. దళిత, గిరిజన బిడ్డలకు కాంగ్రెస్ చేసిన దశాబ్దాల పాపమే ఆ పార్టీని మరో వందేళ్లయినా శాపంలా వెంటాడుతూనే ఉంటుంది. కర్ణాటకలో నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి పాలించే ఎబిలిటీ లేదు. ప్రజల్లోక్రెడిబిలిటీ లేదు.

తెలంగాణ రాష్ట్రం అంటేనే దేశానికే ఓ పరిపాలనా పాఠం. ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చని పార్టీ మీది. ఇవ్వని హామీలెన్నో అమలు చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీది. తెలంగాణలో బీజేపీకి చరిత్ర లేదు. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు.. చరిత్ర, భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే’’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.