Site icon HashtagU Telugu

KTR On BJP:సోము వీర్రాజుపై మంత్రి కేటీఆర్ సెటైర్లు.. వాట్ ఏ షేమ్ అంటూ ట్వీట్‌

KTR

KTR

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ప్ర‌జాగ్ర‌హా స‌భ‌లో చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు దేశమంతా వైర‌ల్ అవుతున్నాయి. రూ.75కే చీప్ లిక్క‌ర్ ఇస్తామ‌ని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. ఇటు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా సోము వీర్రాజు పై సెటైర్లు వేశారు. “వాహ్… వాట్ ఏ స్కీమ్ ! వాట్ ఏ షేమ్ అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి రామారావు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రూ.75కే చీప్ లిక్కర్ ఇస్తామని.. రాష్ట్ర ఆదాయం మెరుగుపడితే ప్రభుత్వం ధరను రూ.50కి త‌గ్గిస్తామ‌ని సోము వీర్రాజు అన్నారు. 50 రూపాయలకే చీప్ లిక్కర్ సరఫరా చేయాలనేది బిజెపి జాతీయ విధానమా, లేక నిరాశ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ అని మంత్రి కేటీఆర్ ప్ర‌శ్నించారు.

కాగా, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వై.ఎస్ ష‌ర్మిల…మంత్రి కేటీఆర్ ట్వీట్‌పై కూడా స్పందించారు. బీజేపీ చీప్ లిక్కర్ కోసమైతే… టీఆర్‌ఎస్‌ది కాస్ట్లీ లిక్కర్ అంటూ ట్వీట్ చేశారు. ఎక్కడ చూసినా మద్యం, లిక్కర్ పేరుతో దోచుకోవడం, ప్రజలను, యువతను మద్యానికి బానిసలు చేయడమే టీఆర్ఎస్ స‌ర్కార్ ప‌ని అని ట్వీట్ చేశారు. మహిళల భద్రతను పక్కన పెట్టి బలవంతంగా మద్యం అమ్మండి అంటూ ఎద్దేవా చేశారు.