Site icon HashtagU Telugu

KTR : ఈ గిరిజ‌న బిడ్డలకు రెండో విడుత రైతుబంధు ఇస్తారా..? ఇవ్వ‌రా..?

Ktr

Ktr

KTR : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 7వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ జరుగుతోంది. రైతుబంధు పథకం గురించి చర్చ జరుగుతుండగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. “గత ప్రభుత్వంలో అమలు చేసిన రైతుబంధు పథకాన్ని నిష్పక్షపాతంగా కొనసాగించాలనే ఉద్దేశం ఉంటే, దానిపై చర్చ ఎందుకు జరుగుతోంది?” అని ఆయన ప్రశ్నించారు.

గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు పథకం ద్వారా రూ. 73 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఒక్క సారి మాత్రమే ఈ పథకం అమలు చేశామని చెప్పడం అభినందనీయమని అన్నారు. అయితే, తుమ్మల పేర్కొన్నట్లు రూ. 21,283 కోట్ల దుర్వినియోగం జరిగిందని అన్నారు. 2019-20లో సాగు విస్తీర్ణం 141 లక్షల ఎకరాలు కాగా, 2020-21లో అది 204 లక్షల ఎకరాలకు పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. రైతుబంధు పథకం వల్లే ఈ విస్తీర్ణం పెరిగిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

Thierry Jacob: ఫ్రెంచ్ మాజీ ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ క‌న్నుమూత.. రీజ‌న్ ఇదే!

ఆర్వోఎఫ్ఆర్ భూముల కింద ఒకే పంట సాగు చేసే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ గిరిజన భూములకు రెండో విడత రైతుబంధు అందిస్తారా లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలన్నారు. పత్తి, కంది పంటలు 8 నెలల కాలం ఉండటంతో ఒక్కసారి రైతుబంధు చెల్లింపు సరిపోతుందా లేక రెండుసార్లు ఇస్తారా అనే ప్రశ్నను కేటీఆర్ వినిపించారు. పామాయిల్, మామిడి తోటల వంటి వ్యవసాయాలకు రైతుభరోసా వర్తిస్తుందా అనే దానిపై కూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. “రైతుబంధుకు కోతలు పెట్టబోమని చెబుతూనే పీఎం కిసాన్ మార్గదర్శకాలను అనుసరించాలంటున్న ప్రభుత్వం ఎందుకు చర్చలు చేపడుతోంది?” అని కేటీఆర్ ప్రశ్నించారు. పీఎం కిసాన్ గైడ్‌లైన్స్ ప్రకారం 25% మంది రైతులకే రైతు భరోసా వర్తిస్తుందన్నారు.

రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మూడు పంటలు సాగు చేసేవారికి రైతుభరోసా వర్తిస్తుందా లేదా అనే అంశంపై ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. “ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే మూడో పంటకు రైతుభరోసా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇప్పుడు అదే పద్ధతిని మీరు అమలు చేస్తారా?” అని కేటీఆర్ నిలదీశారు. రైతుల ప్రయోజనాల కోసం సరైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ సూచించారు.

Gold Price Today : మగువలకు గుడ్‌ న్యూస్‌.. తగ్గిన బంగారం ధరలు..!