KTR Promises: జనవరిలో కొత్త రేషన్ కార్డులు: కేటీఆర్

జనవరిలో కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో బిజిబిజిగా గడుపుతున్న కేటీఆర్ ప్రత్యర్థి పార్టీలపై దూకుడు పెంచారు.

KTR Promises: జనవరిలో కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో బిజిబిజిగా గడుపుతున్న కేటీఆర్ ప్రత్యర్థి పార్టీలపై దూకుడు పెంచారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల గత వైఫల్యాలను తవ్వుతూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ మూడు గంటలు కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలో, 24 గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ ఎస్ కావాలో ఆలోచించి ఓటేయ్యండని సూచించారు. చొప్పదండి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో కార్యక్రమానికి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 55 ఏళ్లు పాలించినకాంగ్రెస్ పార్టీ సాగునీరు, తాగునీరు, కరెంటు, బంగారు కంకణాలు ఇచ్చిందని విమర్శించారు. రైతులకు రైతుబంధు కింద 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73 వేల కోట్లు జమ అవుతున్నాయి అని కేటీఆర్ చెప్పారు. అభివృద్ధి కావాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కేటీఆర్ అన్నారు. 400 గ్యాస్ ధరను ప్రధాని నరేంద్ర మోదీ రూ. 1200లు చేశారని, దీంతో పేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.400 రూపాయలకే గ్యాస్ అందజేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 93 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులకు అన్నపూర్ణ పథకం కింద చిన్న బియ్యం అందజేస్తామన్నారు.

Also Read: Telangana: కేసీఆర్ నడిచే రోడ్డు, చదివిన పాఠశాల కాంగ్రెస్‌ నిర్మించిందే: రాహుల్