Site icon HashtagU Telugu

KTR: యూఎస్ వీధుల్లో మంత్రి కేటీఆర్…స్టూడెంట్ లైఫ్ గుర్తుచేసుకుంటూ…!!!

Ktrao

Ktrao

తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీర్ అమెరికా పర్యటన సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా పర్యటకు వెళ్లిన కేటీఆర్…పలు సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. పెట్టుబడులు పెట్టాలని కోరారు. దీంతో పలు సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే న్యూయార్క్ సిటీలో ఓ సమావేశం ముగిసిన తర్వాత వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్న మంత్రి కేటీఆర్ స్ట్రీట్ ఫుడ్ టెస్ట్ చేశారు.

Lexington & 34th దగ్గర స్ట్రీట్ ఫుడ్ చూశానని…అక్కడికి వెళ్లి..వేడి సాస్ తో చికెన్ తిన్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ఫోటోను చూసిన నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పలు కామెంట్స్ కూడా చేస్తున్నారు. మీ శ్రమ వృధా కాదు…తెలంగాణ సమాజం కోసం, ప్రజల కోసం గట్టి సంకల్పంతో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు చేస్తున్న మీ ప్రయాణం సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. సెక్యూరిటీ లేకుండా సింగిల్ గా సింపుల్ గా భోజనం చేస్తున్న మీరు గ్రేట్ సార్ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా పదుల సంఖ్యలో నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.