Site icon HashtagU Telugu

KTR: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల వైబ్ సైట్ ను ప్రారంభించిన కేటీఆర్

Ktr

Ktr

KTR: BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి. రామారావు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఖాళీలపై సమగ్ర వివరాలను అందించడానికి వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఇందులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లు, ఇప్పటివరకు నోటిఫై చేసిన ఖాళీల వివరాలతో పాటు ప్రక్రియ ఎక్కడ పూర్తయింది, ఇంకా ఎక్కడ కొనసాగుతోంది లాంటి సమాచారం ఉంది. వెబ్‌సైట్ రిక్రూటింగ్ ఏజెన్సీల వారీగా వివరాలు, శాఖల వారీగా వివరాలు, 2004, 2023 మధ్య భర్తీ చేయబడిన ప్రభుత్వ ఉద్యోగాల వివరాలున్నాయి.

“గత 9.5 సంవత్సరాలలో, తెలంగాణ ప్రభుత్వం 2,32,308 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఉద్యోగ ఖాళీలను గుర్తించింది. 1,60,083 భర్తీ చేసింది. ఇది జనాభాకు సంబంధించి ఏ రాష్ట్రానికైనా అత్యధికం” అని రామారావు చెప్పారు. డిసెంబర్‌లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఉద్యోగాల క్యాలెండర్‌ విడుదల చేస్తామన్నారు. ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.