Site icon HashtagU Telugu

BRS Minister: మంత్రి ప్రశాంత్ రెడ్డికి మాతృ వియోగం, కేటీఆర్, కవిత సంతాపం

Prashanth

Prashanth

BRS Minister: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇవాళ తల్లి మంజులమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. తండ్రి వేముల సురేందర్ రెడ్డి కూడా ఆనారోగ్యంతో ఏడేళ్ల క్రితం మరణించారు. అప్పటి నుంచి తల్లి మంజుల మానసికంగా కృంగి పోయింది. ఆనారోగ్యం పాలైంది. గతంలో బ్రేయిన్ ట్యూమర్ సర్జరీ జరిగింది. దీంతో అప్పట్నుంచి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంది.

రెండు నెలలుగా హైదరాబాద్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు.. అయితే పరిస్థితి విషమించి హాస్ప‌ట‌ల్ లోనే మృతి చెందారు. వేముల ప్రశాంత్ రెడ్డి కి తల్లి మృతి చెందటంతో బాల్కొండ నియోజక వర్గంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఆయన స్వగ్రామం వేల్పూరు మండల కేంద్రంలో అంత్య క్రియలు జరగనున్నాయి. మంత్రి తల్లి మృతి చెందడంతో కేటీఆర్, కవిత సంతాపం తెలియజేశారు. వీరితో ఇతర మంత్రులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.