Site icon HashtagU Telugu

Puvvada Comments: సీఎం అయ్యేందుకు కేటీఆర్‌ సిద్ధం: మంత్రి పువ్వాడ

Puvvada

Puvvada

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, ఐటీ మినిస్టర్ కాబోయే సీఎం అంటూ తెలంగాణ మంత్రులు చాలాసార్లు అభిప్రాయపడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ (KTR) సీఎం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారనే వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది.

బీఆర్ఎస్ ప్రస్తుత సీఎం, కాబోయే సీఎం ఇద్దరూ ఉన్నారని మంత్రి పువ్వాడ అన్నారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు కేటీఆర్ (KTR) సిద్ధంగా ఉన్నారన్నారు. గొంగలి పురుగులా ఉన్న ఖమ్మం పట్టణాన్ని సీతాకోక చిలుకలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కే దక్కుతుందని వివరించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని పట్టణ ప్రగతి దినోత్సవాల్లో భాగంగా ఖమ్మంలో చేపట్టిన ర్యాలీలో మంత్రి అజయ్ పాల్గొన్నారు.

Also Read: Elephant Hunts: పులిని తరిమివేసిన ఏనుగు.. నెట్టింట్లో వీడియో వైరల్