Site icon HashtagU Telugu

Formula E is Car Racing : కేటీఆర్ మ‌ధ్యంత‌ర బెయిల్ 31 వ‌ర‌కు పొడిగింపు

KTR interim bail extended till 31

KTR interim bail extended till 31

Formula E is Car Racing : ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖ‌లు చేసిన‌ క్వాష్ పిటిష‌న్‌పై హైకోర్టులో శుక్ర‌వారం విచార‌ణ జ‌రిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఈనెల 31కి క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా వేయగా.. మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్ కొట్టివేయాలని ఏసీబీ కౌంటరు దాఖలు చేసింది. ఈ క్రమంలోనే క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేస్తూనే.. ఈనెల 31 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దంటూ స్టే పొడిగించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను కోర్టు ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 30 వ‌ర‌కు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్ద‌ని వారం రోజుల క్రితం హైకోర్టు ఏసీబీని ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.

కాగా, ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఓవైపు ఏసీబీ అధికారులు దూకుడు పెంచగా.. తనపై అన్ని తప్పుడు కేసులు పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. వీటిని కొట్టేయాలని ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఫార్ములా ఈరేస్ వ్యవహారానికి సంబంధించి సుదీర్ఘంగా వాదనలు వినిపించిన తర్వాత కేటీఆర్‌కు హైకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. అయితే దాన్ని కూడా ఎత్తివేయాలని, పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఏసీబీ పిటిషన్‌లో పేర్కొంది. ఈ సమయంలో కేటీఆర్‌కు బెయిల్ మంజూరు చేసినా, రిలీఫ్ ఇచ్చినా, నాట్‌ టు అరెస్ట్ ఇచ్చినా విచారణకు ఇబ్బందికర వాతావరణం ఉంటుందని ఏసీబీ వెల్లడించింది.

డిసెంబర్ 31న ఫార్ములా ఈ కార్ రేస్‌పై ప్రభుత్వం వేసిన పిటిషన్‌పైన వాదనలు కొనసాగుతాయి. నాట్ టు అరెస్ట్‌ను ఎత్తివేయాలని ఏసీబీ మరో పిటిషన్‌ను వేసింది. ఆ పిటిషన్‌కు సంబంధించి ప్రతివాదిగా కేటీఆర్‌ను చేర్చారు. దీంతో కేటీఆర్ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. నాట్‌ టు అరెస్ట్‌పై కేటీఆర్‌ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వాదనలు జరుగనున్నాయి. ఈ రెండు అంశాలపై డిసెంబర్ 31న ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపై ఉత్కంఠ ఏర్పడింది.

Read Also: Manmohan Singh : మన్మోహన్‌ సింగ్ కాంగ్రెస్‌కు బలమైన వికెట్‌గా ఎలా మారారు..!