Chemo India: జీనోమ్ వ్యాలీలోని కెమో ఇండియా ఫార్ములేషన్ ప్రైవేట్ లిమిటెడ్ క్యాంపస్‌లో పరిశోధనా కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కెమో ఇండియా ప్రముఖ స్పానిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. కెమో కంపెనీ 1977లో స్థాపించారు. ఈ కంపెనీ 40 కంటే ఎక్కువ దేశాల్లో పనిచేస్తుంది. 100 కంటే ఎక్కువ దేశాలలో తమ ఉత్పత్తుల్ని విక్రయిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 18 పారిశ్రామిక ప్లాంట్లను కలిగి ఉంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా టాప్ 5లో ఉంది.
కేటిఆర్ మాట్లాడుతూ దావోస్ 2022లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా కెమో ప్రతినిధుల్ని కలిశానని , అందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. అప్పుడే ఈ సంస్థను హైదరాబాద్‌లో నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నట్టు కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సంస్థను నెలకొల్పడం సంతోషిస్తున్నాని అన్నారు. ఇందుకు ఇన్సుడ్ ఫార్మా బృందాన్ని అభినందిస్తున్నాను. కంపెనీ బృందం హైదరాబాద్ నగరంలో సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను అని మంత్రి కేటీఆర్ అన్నారు.
Also Read: Naga Panchami: నాగ పంచమిరోజు పుట్టలో పాలు పోస్తే సంతానం కలుగుతుందా?